టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?
Breaking News
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
భారత్కు ట్రంప్ భారీ ఊరట.. 100% టారిఫ్కు బ్రేక్
పులివెందులకూ పాకిన టీడీపీ దౌర్జన్యకాండ
చంద్రబాబు పాలనలో జంగిల్ రాజ్.. ఆగని పచ్చ మూకల అరాచకాలు!
అర్ధరాత్రి ఖాకీ బూచోళ్లు!.. పల్నాడులో దాష్టీకం
దీప్కే ఎక్కడ?
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
రూ.6,000 కోట్ల డీల్: ఐనాక్స్ క్లీన్ చేతికి వేనా ఎనర్జీ
Published on Fri, 06/05/2026 - 15:30
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ ఐనాక్స్ క్లీన్ ఎనర్జీ తాజాగా వేనా ఎనర్జీ ఇండియా కొనుగోలుకి ఒప్పందం కుదుర్చుకుంది. తద్వా రా 6 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన పోర్ట్ఫోలియోను సొంతం చేసుకోనుంది. సంబంధిత వర్గాల అంచనా ప్రకారం ఒప్పందం విలువ రూ. 6,000 కోట్లుకాగా.. వేనా ప్రస్తుతం 1.2 గిగావాట్ల నిర్వహణలోని ఇంధన ఆస్తులతోపాటు.. త్వరలో ప్రారంభంకానున్న చివరి దశ అభివృద్ధిలోని 1.8 గిగావాట్ల ప్రాజెక్టులను కలిగి ఉంది.
వీటికి జతగా మరో 3 గిగావాట్ల అభివృద్ధి దశ ప్రాజెక్టులు సైతం ఉన్నట్లు ఐనాక్స్ క్లీన్ వెల్లడించింది. అంతేకాకుండా విద్యుత్ కొనుగోలుకి సోలార్ ఎస్ఈసీఐ, గుజరాత్ ఉర్జా వికాస్ నిగమ్ తదితర వా ణిజ్య, పారిశ్రామిక క్లయింట్లుసహా.. ప్రభుత్వ రంగ పంపిణీ సంస్థలతో ఒప్పందాలను కలిగి ఉంది.
#
Tags : 1