Breaking News

భారత్‌పై అంతర్జాతీయ ఐటీ సంస్థ దృష్టి - వచ్చే ఏడాది నుంచి..

Published on Sat, 11/18/2023 - 07:09

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఐటీ సంస్థ ఇన్నోవా సొల్యూషన్స్‌ భారత మార్కెట్‌పై మరింతగా దృష్టి పెడుతోంది. వచ్చే ఏడాది (2024) ఇక్కడ కార్యకలాపాలను విస్తరించడంతో పాటు పెద్ద ఎత్తున నియామకాలను కూడా చేపట్టనుంది. సంస్థ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్, భారత విభాగం హెడ్‌ ప్రదీప్‌ యడ్లపాటి ఈ విషయాలు తెలిపారు.

అమెరికాలోని జార్జియా కేంద్రంగా పనిచేస్తున్న ఇన్నోవా సొల్యూషన్స్‌ 1998లో ప్రారంభమైంది. 2010లో పేరోల్‌ సిస్టమ్స్, 2016లో టెక్నాలజీ సొల్యూషన్స్‌ విభాగంలోకి కంపెనీ ప్రవేశించింది. బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, బీమా), కమ్యూనికేషన్స్, మీడియా తదితర రంగాల్లో వెయ్యికి పైగా క్లయింట్లకు సేవలు అందిస్తోంది.

ప్రస్తుతం అమెరికా, భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, సింగపూర్‌ తదితర దేశాల్లో 100 పైచిలుకు కార్యాలయాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా 55,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉండగా.. భారత్‌లో 10,000 మంది సిబ్బంది ఉన్నారు. భారత్, ఆసియా–పసిఫిక్‌లోని తమ కార్యకలాపాల పర్యవేక్షణ కోసం ఈ ఏడాది తొలినాళ్లలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో కీలక హోదాలో ఉన్న యడ్లపాటిని నియమించుకుంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)