ఆఫ్‌షోరింగ్ తర్వాత అతిపెద్ద ఐటీ విప్లవం

Published on Fri, 07/31/2026 - 09:05

భారత ఐటీ రంగంలో ఇన్ఫోసిస్ భవిష్యత్తు కీలక మలుపు వద్ద ఉందని ప్రస్తుత ఎండీ, సీఈఓ సలీల్ పరేఖ్ అన్నారు. ఆయన పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ను గతంలో కంటే మరింత మెరుగైన, దృఢమైన స్థానంలో నిలిపి వెళ్తున్నానని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవల రంగంలో రాబోయే రోజుల్లో ఇన్ఫోసిస్ ప్రపంచస్థాయిలో తిరుగులేని విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

సలీల్ పరేఖ్ నాయకత్వంలో ఇన్ఫోసిస్ కేవలం సాంప్రదాయ ఐటీ సేవలకు పరిమితం కాకుండా గ్లోబల్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ దిశగా వేగంగా రూపాంతరం చెందింది. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ పరిశ్రమ మందగమనం, భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఇన్ఫోసిస్ బిలియన్ డాలర్ల భారీ ఒప్పందాలను దక్కించుకోవడంలో విజయం సాధించింది. ప్రస్తుతం ఇన్ఫోసిస్ ప్రధాన క్లయింట్లలో దాదాపు 90 శాతానికి పైగా సంస్థలు ఏఐ సాంకేతికత ఆధారిత పరిష్కారాలను వినియోగిస్తుండటం, పరేఖ్ చేపట్టిన వ్యూహాత్మక మార్పుల సామర్థ్యానికి అద్దం పడుతోంది.

ఇంజినీరింగ్, లెగసీ మోడర్నైజేషన్, డేటా, ప్రాసెస్ ఆటోమేషన్ వంటి కీలక రంగాల్లో ఏఐ ఆధారిత సేవల ద్వారా సుమారు 300 బిలియన్‌ డాలర్ల గ్లోబల్ మార్కెట్ అవకాశాన్ని అందుకునేందుకు కంపెనీ సన్నద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. 35 ఏళ్ల క్రితం ఐటీ రంగాన్ని ఊపేసిన ఆఫ్‌షోరింగ్ మోడల్ తర్వాత ఏఐ ప్రవేశంతో వస్తున్న ఈ ఆపరేటింగ్ మోడల్ మార్పు అతిపెద్ద సాంకేతిక విప్లవమని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: రైల్వే తత్కాల్ బుకింగ్‌లో మార్పులు

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)