Breaking News

Infosys Q3 Results: ఇన్ఫోసిస్‌ అదుర్స్‌..

Published on Thu, 01/16/2025 - 20:39

దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ (Infosys) మూడో త్రైమాసిక ఫలితాలను (Q3 Results) వెల్లడించింది. అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికంలో కంపెనీ రూ.6,806 కోట్ల నికర లాభాలను సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలోని రూ.6,506 కోట్లతో పోలిస్తే ఇది 11.4 శాతం అధికం. అదే ఇంతకుముందు త్రైమాసికంలో (Q2FY25) నమోదు చేసిన రూ.6,106 కోట్లతో పోలిస్తే 4.6 శాతం ఎక్కువ.

ఇక అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికంలో ఆదాయం రూ. 41,764 కోట్లుగా ఉంది. ఇది గతేడాది క్యూ3తో వచ్చిన రూ. 38,821 కోట్లతో పోలిస్తే 7.6 శాతం వృద్ధిని ప్రతిబింబిస్తుంది. అదే సమయంలో మునుపటి త్రైమాసికంలో ఆర్జించిన (Q2FY25) రూ.40,986 కోట్లతో పోలిస్తే 1.9 శాతం పెరుగుదల.  స్థిరమైన కరెన్సీ పరంగా ఆదాయం సంవత్సరం మీద 6.1 శాతం, త్రైమాసికం మీద 1.7 శాతం పెరిగింది.

త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో భవిష్యత్‌ ఆదాయ వృద్ధి అంచనాలను కూడా సైతం ఇన్ఫోసిస్ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి 4.5 నుంచి 5 శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది.

సీఈవో ఏం చెప్పారంటే..
"క్రమానుగతంగా బలహీనమైన త్రైమాసికంలో బలమైన రాబడి వృద్ధిని సాధించాం. మా విభిన్న డిజిటల్ ఆఫర్‌లు, మార్కెట్ పొజిషనింగ్, కీలక వ్యూహాత్మక కార్యక్రమాల విజయానికి ఇది స్పష్టమైన ప్రతిబింబం. సంస్థలో ఏఐ సామర్థ్యాలను బలోపేతం చేస్తూనే ఉంటాం. ముఖ్యంగా ఉత్పాదక ఏఐపై దృష్టి సారిస్తున్నాం. ఇదే క్లయింట్లు పెరగడానికి కారణం” అని ఇన్ఫోసిస్‌ సీఈవో, ఎండీ సలీల్ పరేఖ్ అన్నారు.

పెరిగిన క్లయింట్లు
సెప్టెంబరు త్రైమాసికంలో 1,870గా ఉన్న క్లయింట్ల క్రియాశీలక సంఖ్య డిసెంబర్ త్రైమాసికంలో 1,876కి పెరిగిందని ఇన్ఫోసిస్ తెలిపింది. ఇక స్వచ్ఛంద అట్రిషన్ (ఉద్యోగుల సంఖ్యలో తరుగుదల) గత సెప్టెంబర్ త్రైమాసికంలో 12.9 శాతం ఉండగా ఈ త్రైమాసికంలో 13.7 శాతంగా ఉంది. మొత్తం ఉద్యోగుల సంఖ్య సెప్టెంబర్‌లో 3,17,788 ఉండగా ఈ త్రైమాసికంలో 3,23,379గా కంపెనీ పేర్కొంది. వరుసగా రెండవ త్రైమాసికంలో హెడ్‌కౌంట్ పెరిగింది. క్రితం సంవత్సరం త్రైమాసికంలో ఇది 3,22,663.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)