Breaking News

ఇన్ఫోసిస్‌ కీలక నిర్ణయం.. ఆఫర్‌ లెటర్‌ జారీలో మార్పులు

Published on Tue, 10/08/2024 - 18:40

దేశీయ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ తన ఆన్‌బోర్డింగ్ ప్రక్రియలో పెద్ద సంస్కరణను ప్రకటించింది. ఈమెయిల్‌ల ద్వారా జాబ్ ఆఫర్ లెటర్‌ల జారీని నిలిపివేయాలని నిర్ణయించింది. కంపెనీలో కొత్తగా చేరేవారందరూ ఇకపై  అప్లికేషన్ వివరాలను యాక్సెస్ చేయడానికి కంపెనీ అంతర్గత పోర్టల్‌లోకి లాగిన్ అవ్వడాన్ని తప్పనిసరి చేసింది.

నియామక ప్రక్రియలో మోసాలను అరికట్టడం, ఆన్‌బోర్డింగ్ ప్రక్రియలో ఉద్యోగులకు మెరుగైన అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ఇన్ఫోసిస్‌ ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ చర్య ఫలితంగా అభ్యర్థులు ఆఫర్‌ లెటర్‌ను చూపి ఇతర కంపెనీలతో బేరసారాలు చేయడం కష్టతరమవుతుంది.

"ముఖ్యమైన నోటీసు-ఇన్ఫోసిస్ ఆఫర్ లెటర్, అనుబంధ పత్రాలు మా కెరీర్ సైట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు తమ లాగిన్ ఆధారాలను ఉపయోగించి దీన్ని యాక్సెస్ చేయవచ్చు. ఇకపై అభ్యర్థులకు ఆఫర్ లెటర్‌లను ఈమెయిల్‌లకు పంపబోము" కంపెనీ పోర్టల్‌లో పేర్కొంది.

భారతీయ సాఫ్ట్‌వేర్ సేవల పరిశ్రమలో ఫ్రెషర్‌ల ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఆందోళన పెరుగుతున్న తరుణంలో ఇన్ఫోసిస్ ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కంపెనీ ఫైలింగ్‌ల ప్రకారం.. 2024 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ 24 లక్షల ఉద్యోగ దరఖాస్తులను అందుకుంది. వీటిలో 194,367 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి 26,975 మందిని ఉద్యోగాల్లోకి తీసుకుంది.

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు