Breaking News

ఇన్ఫోసిస్‌కి భారీ షాక్‌! రూ.12 వేల కోట్ల డీల్‌ క్యాన్సిల్‌

Published on Sat, 12/23/2023 - 19:37

దేశీయ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌కి భారీ షాక్‌ తగిలింది. గ్లోబల్‌ కంపెనీతో చేసుకున్న సుమారు రూ.12 వేల కోట్ల డీల్‌ క్యాన్సిల్‌ అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ కోసం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని (MOU) సదరు కంపెనీ రద్దు చేసు​కుందని ఇన్ఫోసిస్ వెల్లడించింది. 

ఈ భారీ ఒప్పందం ఈఏడాది సెప్టెంబర్‌లో ఖరారైంది. 15 సంవత్సరాల కాలానికి చేసుకున్న ఈ డీల్‌ ప్రారంభంలోనే ముగిసిపోవడం ఐటీ సేవల రంగంలో క్లయింట్‌ల డిమాండ్, సాంకేతిక బడ్జెట్‌లలో పెరుగుతున్న అనిశ్చితిని తెలియజేస్తోంది.

ఇదీ చదవండి: ...అలా విజయం సాధించినట్లు చరిత్రలో లేదు

“గ్లోబల్ కంపెనీతో ఎంఓయూకి సంబంధించి 'కంపెనీ అప్‌డేట్' పేరుతో 2023 సెప్టెంబర్ 14 నాటి ఇన్ఫోసిస్ ప్రకటనకు ఇది కొనసాగింపు. గ్లోబల్ కంపెనీ ఇప్పుడు ఎంవోయూను రద్దు చేయడానికి నిర్ణయించింది. దీంతో ఇరు పక్షాలు మాస్టర్ అగ్రిమెంట్‌ను అనుసరించడం లేదు” అని కంపెనీ డిసెంబర్‌ 23న ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.

సీఎఫ్‌వో రాజీనామా చేసిన రెండు వారాల్లోనే..
కంపెనీ సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ ఆకస్మికంగా వైదొలిగిన రెండు వారాల లోపే ఈ భారీ డీల్‌ క్యాన్సిల్‌ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్‌ మెరుగైన డిజిటల్‌ సేవలు, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అందించడానికి గ్లోబల్‌ కంపెనీతో అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు సెప్టెంబర్ 14న ప్రకటించింది.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)