Breaking News

ఇన్ఫోసిస్‌లో 300 మంది ఫ్రెషర్ల తొలగింపు 

Published on Sat, 02/08/2025 - 06:23

న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌ 300 మంద్రి ఫ్రెషర్లను తొలగించింది. మైసూరులోని క్యాంపస్‌లో వీరికి ప్రాథమిక శిక్షణ ఇవ్వగా, అంతర్గతంగా నిర్వహించిన మదింపు ప్రక్రియల్లో మెరుగైన పనితీరు చూపించలేకపోయినట్టు, మూడు విడతలు అవకాశం ఇచ్చినప్పటికీ  ఉత్తీర్ణత సాధించకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్టు ఇన్ఫోసిస్‌ ప్రకటించింది. కానీ, వాస్తవానికి ఇలా తొలగించిన వారి సంఖ్య మరింత ఎక్కువే ఉంటుందని ఐటీ ఉద్యోగుల సంఘం నైటెస్‌ తెలిపింది. 

కేంద్ర కారి్మక, ఉపాధి కల్పన శాఖకు ఫిర్యాదు చేస్తామని కూడా  హెచ్చరించింది. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని కంపెనీపై కఠినమైన చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. దీనిపై మీడియా సంస్థలు వివరణ కోరగా.. ‘‘ఇన్ఫోసిస్‌లో కఠినమైన నియామక ప్రక్రియను అనుసరిస్తాం. మైసూరు క్యాంపస్‌లో విస్తృతమైన ప్రాథమిక శిక్షణ అనంతరం అంతర్గత మదింపు ప్రక్రియల్లో ఫ్రెషర్లు (ఎలాంటి అనుభవం లేకుండా కొత్తగా ఉద్యోగ అవకాశాలు పొందిన వారు) విజయం సాధించాల్సి ఉంటుంది. 

ఇందుకు గాను ప్రతి ఒక్కరి మూడు విడతలుగా అవకాశం కల్పిస్తాం. అయినప్పటికీ విఫలమైతే వారు సంస్థతో కలసి కొనసాగలేరు. ఉద్యోగ కాంట్రాక్టులో ఈ నిబంధన కూడా ఉంటుంది. రెండు దశాబ్దాల నుంచి ఇదే ప్రక్రియ అమల్లో ఉంది. మా క్లయింట్ల అవసరాలను తీర్చే అత్యుత్తమ నైపుణ్యాలు ఉండేలా చూడడమే ఇందులోని ఉద్దేశ్యం’’అని ఇన్ఫోసిస్‌ సంస్థ వివరణ ఇచ్చింది.  

మూడు నెలల క్రితమే చేరిక 
తాజాగా తొలగింపునకు గురైన వారి సంఖ్య గణనీయంగా ఉంటుందని నాసెంట్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎంప్లాయిస్‌ సెనేట్‌ (నైటెస్‌) పేర్కొంది. వీరిని 2024 అక్టోబర్‌లో నియమించుకున్నట్టు తెలిపింది. ‘‘ఆఫర్‌ లెటర్లు అందుకున్న తర్వాత వీరంతా రెండేళ్లపాటు నిరీక్షించారు. నైటెస్, బాధిత అభ్యర్థులు కలసి చేసిన సుదీర్ఘ పోరాటం  తర్వాతే వారిని ఉద్యోగాల్లోకి తీసుకున్నారు’’అని ప్రకటించింది.   
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)