Breaking News

‘ఇన్ఫోసిస్‌ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయింది’

Published on Tue, 02/18/2025 - 20:13

ఐటీ దిగ్గజాలు కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ మధ్య న్యాయ పోరాటం తీవ్రంగా మారింది.  తమ హెల్త్‌కేర్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన వాణిజ్య రహస్యాలను ఇన్ఫోసిస్ దొంగిలించి రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయిందని  కాగ్నిజెంట్ ఆరోపించింది.​​​ పోటీ ఉత్పత్తిని అభివృద్ధి చేయడానికి ఇన్ఫోసిస్ గోప్యమైన డేటాను దుర్వినియోగం చేసిందని, బహిర్గతం చేయని ఒప్పందాలను (NDAs) ఉల్లంఘించిందని కాగ్నిజెంట్ ఆరోపించింది .

కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్‌ల మధ్య యూఎస్‌ కోర్టులో ఓ దావా నడుస్తోంది. తమ హెల్త్ కేర్ సాఫ్ట్‌వేర్ ట్రైజెట్టో వాణిజ్య రహస్యాలను ఇన్ఫోసిస్  దొంగిలించిందని ఆరోపిస్తూ కాగ్నిజెంట్‌ కేసు దాఖలు చేసిందని మింట్ నివేదిక తెలిపింది. "నాన్‌ డిస్‌క్లోజర్‌ అండ్‌ యాక్సెస్‌ అగ్రిమెంట్స్‌ (NDAAs) ద్వారా ఇన్ఫోసిస్‌ తమ ట్రైజెట్టో వాణిజ్య రహస్యాలను దుర్వినియోగం చేస్తూ ఇన్ఫోసిస్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది" అని 22 పేజీల కోర్టు ప్రతిస్పందనను ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది.

ఇదీ చదవండి: టీసీఎస్‌ వీసా ఫ్రాడ్‌ చేసింది.. మాజీ ఉద్యోగుల ఆరోపణలు 

తమ ట్రైజెట్టో సమాచారాన్ని ఉపయోగించారా లేదా అన్నది ఆడిట్ చేయడానికి ఇన్ఫోసిస్ నిరాకరించిందని, ఇది తన తప్పును రుజువు చేస్తుందని కాగ్నిజెంట్‌ వాదిస్తోంది.  ఈ చట్టపరమైన వివాదం 2024 ఆగస్టు నాటిది. కాగ్నిజెంట్ మొదట డల్లాస్ కోర్టులో ఈ ప్రకటన చేసింది. గత జనవరి 9న దాఖలు చేసిన కేసులో ఈ ఆరోపణను ఇన్ఫోసిస్  తిరస్కరించింది, కాగ్నిజెంట్‌కు సంబంధించిన హెల్త్‌ కేర్‌ సొల్యూషన్స్‌ బహిరంగంగానే ఉన్నాయని, అందులో వాణిజ్య రహస్యాలు ఏమున్నాయో వారే చూసుకోవాలని కాగ్నిజెంట్‌కు సూచించాలని కోర్టును ఇన్ఫోసిస్‌ కోరింది.

ఇన్ఫోసిస్ ప్రతి దావా
ఇన్ఫోసిస్ తరువాత కాగ్నిజెంట్ పై ప్రతి దావా వేసింది. దాని సీఈవో రవి కుమార్ ఇన్ఫోసిస్ లో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇన్ఫోసిస్ సొంత హెల్త్‌కేర్ సాఫ్ట్‌వేర్ ఉత్పత్తిని విడుదల చేయడాన్ని కావాలని ఆలస్యం చేశారని, కాగ్నిజెంట్‌లో ఉద్యోగం కోసం చర్చలు జరిపారని ప్రత్యారోపణలు  చేసింది. రవి కుమార్ 2022 అక్టోబర్‌లో ఇన్ఫోసిస్‌ను వీడారు. ఆ తర్వాత ఏడాది అంటే 2023  జనవరిలో కాగ్నిజెంట్‌లో సీఈవోగా చేరారు. రెండు కంపెనీలు ఆరోగ్య సంరక్షణ సేవల రంగంలో పోటీ పడుతున్నాయి. ఇన్ఫోసిస్ ఆదాయంలో దాదాపు 7.5 శాతం లైఫ్ సైన్సెస్ రంగ క్లయింట్ల నుంచే పొందుతోంది. కాగ్నిజెంట్‌కు కూడా తమ క్లయింట్లలో దాదాపు మూడోవంతు హెల్త్‌ కేర్‌ నుంచే ఉన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)