Breaking News

ఇన్ఫోసిస్‌కు షోకాజ్ నోటీసు.. ఎందుకంటే?

Published on Thu, 08/01/2024 - 07:09

ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ రూ. 32403 కోట్ల జీఎస్‌టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్) ఎగవేతపై ప్రీ-షోకాజ్ నోటీసు అందుకుంది. బీఎస్ఈ ఫైలింగ్‌లో సంస్థ ఈ విషయం వెల్లడించింది.

ఇన్ఫోసిస్ లిమిటెడ్.. విదేశీ బ్రాంచ్ ఆఫీస్‌ల కోసం చేసే ఖర్చుల వివరాలను వెల్లడించకలేదని, వాటికి జీఎస్‌టీ చెల్లించలేదని కర్ణాటక జీఎస్‌టీ అధికారులు ప్రీ-షోకాజ్ నోటీసు జారీ చేశారు. 2017 జులై నుంచి 2022 మార్చి వరకు 32403 కోట్ల రూపాయలకు జీఎస్‌టీ చెల్లింపు చేయలేదనేది ఈ ప్రీ-షోకాజ్ నోటీసు సారాంశం.

దీనిపైన ఇన్ఫోసిస్ స్పందిస్తూ.. అటువంటి ఖర్చులపైన జీఎస్‌టీ వర్తించదని తాము విశ్వసిస్తున్నట్లు వెల్లడించింది. అంతే కాకుండా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్, కస్టమ్స్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, భారతీయ సంస్థకు విదేశీ శాఖలు అందించే సేవలు జీఎస్‌టీ పరిధిలోకి రావని సంస్థ పేర్కొంది.

ఇన్ఫోసిస్ ఎప్పటికప్పుడు జీఎస్‌టీ చెల్లిస్తూనే ఉందని, ఈ విషయంలో తాము కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల నిబంధలనకు లోబడి పాటించాల్సిన అన్ని నిబంధవులను పాటిస్తున్నట్లు తెలిపింది.

ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (ఐజీఎస్‌టీ) చట్టం ప్రకారం భారతదేశం వెలుపల ఉన్న ఇన్ఫోసిస్ కార్యాలయాలు కంపెనీ నుంచి విభిన్న సంస్థలుగా పరిగణించబడతాయని అధికారులు పేర్కొన్నారు. కాబట్టి బ్రాంచ్ కార్యాలయాలు అందించే అన్ని సేవలను దిగుమతిగా పరిగణిస్తామని, తద్వారా జీఎస్‌టీ విధించడం జరుగుతుందని వెల్లడించారు.

#

Tags : 1

Videos

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

డీఎస్సీ ఉద్యోగాలపై బొత్స బాంబు.. 14-15 లక్షలకు పోస్టులు అమ్ముకున్నారు..!

మీ పాదయాత్రలో పాల్గొంటే DSC ఉద్యోగాలు పంచేస్తారా?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు