Breaking News

Infosys: 'వర్క్‌ ఫ్రమ్‌ హోం'పై ఇన్ఫోసిస్‌ కీలక నిర్ణయం

Published on Tue, 12/12/2023 - 21:18

 ప్రముఖ దేశీయ టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీస్‌కు వచ్చి పని చేయాలని సూచించింది. వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తున్న సిబ్బందికి ఈ కొత్త నిబంధన తప్పని సరి అని మెయిల్‌లో పేర్కొంది. 

గత అక్టోబర్‌లో ఇదే తరహా మెయిల్స్‌ను సిబ్బందికి పంపింది. ఆ మెయిల్స్‌ ప్రకారం.. బ్యాండ్‌ 5, బ్యాండ్‌ 6 ఉద్యోగులు నెలకు 10 రోజులు ఆఫీస్‌కు రావాల్సిందేనని పట్టుబట్టింది. ఆసక్తికరంగా వర్క్‌ ఫ్రమ్‌ ఆఫీస్‌ నిర్ణయానికి ముందే సీఈఓ సలీల్‌ పరేఖ్‌ మాట్లాడుతూ.. రిమోట్‌ వర్క్‌ ఇన్ఫోసిస్‌ అనువైందేనని తెలిపారు. 

కొద్దిరోజుల తర్వాత నెలకు 10 రోజులు వర్క్‌ ఫ్రమ్‌ ఆఫీస్‌కి రావాలంటూ ఉద్యోగులకు ఇంటర్నల్‌ మెయిల్స్‌ పంపింది. తాజాగా, వారానికి మూడు రోజులు ఆఫీస్‌లో వర్క్‌ తప్పని సరి చేయడం ఐటీ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. 

తప్పదు.. ఏం చేస్తాం
కొన్ని సందర్భాలలో క్లయింట్‌లకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. కానీ మా వరకు సౌకర్యవంతమైన పని విధానానికే మా మద్దతు ఉంటుంది. మేం ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం కూడా అవకాశం ఇచ్చాం. ఇప్పుడు క్లయింట్‌లకు అనుగుణంగా వర్క్‌ను మార్చాల్సి వస్తుందని సలీల్‌ పరేఖ్‌ అన్నారు.

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)