Breaking News

ఐటీ ఉద్యోగులకు తీవ్ర నిరాశ.. టాప్‌ 2 కంపెనీ ఝలక్‌

Published on Mon, 01/06/2025 - 15:58

దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) వార్షిక వేతనాల పెంపును ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి (Q4FY25)వాయిదా వేసింది. బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ చివరిసారిగా  2023 నవంబర్‌లో జీతాల పెంపును అమలు చేసింది.

అన్ని ఐటీ కంపెనీలదీ అదే దారి
సాధారణంగా సంవత్సరం ప్రారంభంలో అమలు కావాల్సిన వేతన పెంపు ఆలస్యం కావడం ప్రపంచ డిమాండ్ వాతావరణంలో ప్రత్యేకించి ఐటీ సేవల రంగంలో విస్తృత అనిశ్చితిని ప్రతిబింబిస్తోంది. బలహీనమైన విచక్షణ వ్యయం, క్లయింట్ బడ్జెట్ల ఆలస్యం, కొనసాగుతున్న స్థూల ఆర్థిక అనిశ్చితితో ఐటీ కంపెనీలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

ఇటాంటి వాతావరణంలో పోటీ కంపెనీలైన హెచ్‌సీఎల్‌ టెక్‌ (HCLTech), ఎల్‌టీఐ మైండ్‌ట్రీ (LTIMindtree), ఎల్‌&టీ (L&T) టెక్ సర్వీసెస్ కూడా ఖర్చులను తగ్గించుకునేందుకు, లాభదాయకతను కొనసాగించడానికి రెండవ త్రైమాసికంలో జీతం ఇంక్రిమెంట్‌లను దాటవేశాయి.

క్యూ4లో అక్టోబర్ 17న దశలవారీగా వేతనాల పెంపుదలకు ప్లాన్‌ చేస్తున్నట్లు ఇన్ఫోసిస్‌ తెలిపింది. అందులో కొంత భాగం జనవరిలో అమలులోకి వస్తుందని, మిగిలినది ఏప్రిల్‌లో అమలులోకి వస్తుందని క్యూ2 ఫలితాల తర్వాత విలేకరుల సమావేశంలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేష్ సంఘ్‌రాజ్కా తెలిపారు.

లాభం మెరుగు
రెండవ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ నికర లాభం త్రైమాసికానికి 2.2 శాతం పెరిగి రూ. 6,506 కోట్లకు చేరుకుంది. తక్కువ ఆన్‌సైట్ ఖర్చులు, మెరుగైన వినియోగ రేట్లు, మెరుగైన కార్యాచరణ సామర్థ్యాల కారణంగా   మార్జిన్‌లు 10 బేసిస్ పాయింట్ల మేర మెరుగయ్యాయి.

వేతనాల్లో భారీ వ్యత్యాసం
సాధారణంగా ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగులకు (IT Employees) మంచి జీతాలు (Salary) ఉంటాయి. అయితే ఇక్కడ కూడా ఉన్నత స్థాయి అధికారులకు, ప్రారంభ స్థాయి ఉద్యోగులకు మధ్య వేతనాల పెంపు విషయంలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. ‘మనీకంట్రోల్’ విశ్లేషించిన డేటా ప్రకారం.. గత ఐదేళ్లలో దేశంలోని ఐదు ప్రముఖ ఐటీ కంపెనీల్లోని టాప్ ఎగ్జిక్యూటివ్‌ల వేతనాలు 160% పెరిగాయి. కానీ ఫ్రెషర్ల (Freshers) జీతాలు పెరిగింది కేవలం 4 శాతమే.

2024 ఆర్థిక సంవత్సరంలో సీఈవోల (CEO) సగటు వార్షిక వేతనం రూ. 84 కోట్లకు చేరువగా ఉండగా, ఫ్రెషర్స్ జీతాలు రూ. 3.6 లక్షల నుంచి రూ. 4 లక్షలకు పెరిగాయి. డేటాలో చేర్చిన కంపెనీల్లో టీసీఎస్‌ (TCS), ఇన్ఫోసిస్‌ (Infosys), హెచ్‌సీఎల్‌ టెక్‌ (HCLTech), విప్రో (Wipro), టెక్‌ మహీంద్ర (Tech Mahindra) ఉన్నాయి.

ఇదీ చదవండి: అప్పుడు బెంగళూరు.. ఇప్పుడు మరోచోట గూగుల్‌ భారీ ఆఫీస్‌!

ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్ పాయ్‌తో సహా విమర్శకులు వేతన పెరుగుదలలో భారీ వ్యత్యాసంపై ఆందోళన వెలిబుచ్చారు. ఫ్రెషర్‌లకు తక్కువ జీతం ఇస్తున్నప్పుడు ఉన్నత స్థాయి అధికారులకు ఉదారంగా వేతన ప్యాకేజీలు ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. పెరుగుతున్న అసమానతలు, ఆర్థిక వినియోగంపై దాని హానికరమైన ప్రభావాన్ని మోహన్‌దాస్‌ పాయ్ ఎత్తిచూపారు.

ఈ ఐటీ కంపెనీల్లో సీఈవోలు, ఫ్రెషర్లు మధ్య వేతన వ్యత్యాసం తీవ్రంగా ఉంది. ఉదాహరణకు విప్రో నిష్పత్తి 1702:1 వద్ద ఉండగా, టీసీఎస్‌ నిష్పత్తి 192:1. ఐటీ పరిశ్రమలో పరిస్థితి ఇలా ఉంటే.. ఇంజనీరింగ్, తయారీ వంటి ఇతర రంగాలలో వేతన వృద్ధి మరింత దిగజారింది. 2019, 2023 మధ్య ఏటా వేతన వృద్ధి కేవలం 0.8% మాత్రమే.

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)