Breaking News

2030 నాటికి రెట్టింపు ఉద్యోగాలు

Published on Fri, 03/21/2025 - 13:41

వేగంగా వృద్ధి చెందుతున్న భారత మార్కెట్‌ తమ కార్యకలాపాలకు సంబంధించి కీలకంగా ఎదుగుతోందని జర్మన్‌ సెమీకండక్టర్ల సంస్థ ఇన్ఫినియోన్‌ టెక్నాలజీస్‌ సీఎంవో ఆండ్రియాస్‌ ఉర్షిజ్‌ తెలిపారు. తమకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 58,000 మంది, భారత్‌లో 2,500 మంది పైగా ఉద్యోగులు ఉన్నట్లు చెప్పారు. భారత్‌లో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తున్న నేపథ్యంలో 2030 నాటికి ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేసుకోనున్నట్లు ఆయన వివరించారు.

దేశీయంగా ఇతర భాగస్వాములతో కలిసి పని చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఆండ్రియాస్‌ పేర్కొన్నారు. ప్రస్తుతానికి తమ గ్రూప్‌ ఆదాయంలో భారత్‌ వాటా సింగిల్‌ డిజిట్‌ స్థాయిలోనే ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో ఇది మరింతగా పెరగనుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే, సమీప భవిష్యత్తులో ఇక్కడ తయారీ ప్లాంటు ఆలోచనేదీ లేదని వివరించారు. మరోవైపు, కొత్త ఆవిష్కరణలను వేగవంతం చేసే దిశగా ఎల్రక్టానిక్స్, మైక్రో ఎల్రక్టానిక్స్‌ విభాగాల్లో స్టార్టప్‌లకు సహాయం అందించేందుకు వాణిజ్య, పరిశ్రమల శాఖ, ఎల్రక్టానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆండ్రియాస్‌ చెప్పారు.

ఇదీ చదవండి: బీమా సలహా కమిటీలోకి కొత్త సభ్యులు.. ఏం చేస్తారంటే..

సెమీకండక్టర్ పరిశ్రమలో ఇన్ఫినియాన్ టెక్నాలజీస్‌తోపాటు విభిన్న కంపెనీలు యువతకు  అవకాశాలు కల్పిస్తుంది. ఈ పరిశ్రమలో ప్రధానంగా హార్డ్ వేర్ డిజైన్, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌, చిప్ డిజైన్, క్వాలిటీ అస్యూరెన్స్, డిజైన్ అండ్ డెవలప్‌మెంట్‌, సేల్స్ అండ్‌ మార్కెటింగ్ వంటి విభాగాల్లో ఉద్యోగాలుంటాయి. ఇంటెల్, మైక్రాన్, ఇన్ఫినియన్ టెక్నాలజీస్, గ్లోబల్‌ఫౌండ్స్‌.. వంటి కంపెనీలు భారత్‌లో చురుకుగా నియామకాలు చేపడుతున్నాయి.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)