మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం
Breaking News
వర్క్ ఫ్రమ్ హోం చేసే వాళ్ల పరిస్థితి అంతేనా?
Published on Tue, 09/14/2021 - 17:02
Work From Home: సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ సమకాలిన అంశాలపై స్పందించడంలో ఎప్పుడూ ముందుంటారు ఆర్‌పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోం ఉండాలా? వద్దా ? దాని వల్ల ఉపయోగాలు నష్టాలపై ఆయన వరుసగా సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతున్నారు. అవన్ని నవ్వులు పూయించడంతో పాటు చర్చకు సైతం దారి తీస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోం తొలగించి, తన భర్తను ఆఫీసుకు రమ్మనకపోతే తమ దాంపత్య బంధానికి వీడాకులు తప్పవంటూ ఇటీవల ఓ గృహిణి చేసిన రిక్వెస్ట్‌ని షేర్ చేసిన హర్ష్ గోయెంకా... తాజాగా మరో వీడియోను వదిలారు.
నెలల తరబడి వర్క్‌ఫ్రం హోంకి అలవాటైన ఉద్యోగులు.. ఆఫీసులకు వచ్చిన తర్వాత వారి ప్రవర్తన ఎలా ఉంటుందనే అంశంపై ఫన్నీగా చిత్రీకరించిన వీడియోను షేర్ చేశారు. ఆఫీసులో ఉద్యోగులు ఎదురెదురుగా మాట్లాడుతున్నప్పటికీ... వారంతా ఇంటి నుంచి జూమ్ మీటింగ్‌లో పాల్గొన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు.
Scene at workplace after over a year of zoom/teams meetings 😀😀😀! pic.twitter.com/sCCVpMurma
— Harsh Goenka (@hvgoenka) September 13, 2021
హర్స్ గోయెంకా ట్వీట్ చేసిన వీడియోని చూసిన నెటిజన్లు స్పందిస్తున్నారు. ఫన్నీగా ఉన్నప్పటికీ వాస్తవం అదేనంటూ రీ ట్వీట్ చేసి కామెంట్లు పెడుతున్నారు.
చదవండి : Viral Video: ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యపోయిన వేళ!
Tags : 1