Breaking News

ఇండిగో వెంచర్స్‌కు పెట్టుబడులు 

Published on Thu, 07/10/2025 - 06:25

ముంబై: విమానయాన దిగ్గజం ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ కార్పొరేట్‌ వెంచర్‌ క్యాపిటల్‌ విభాగం ఇండిగో వెంచర్స్‌ తొలి ఫండ్‌ ద్వారా రూ. 450 కోట్లు సమీకరించింది. క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతితో గతేడాది ఆగస్ట్‌లో రూ. 600 కోట్ల సమీకరణ లక్ష్యంగా తొలిసారి ఫండ్‌కు తెరతీసింది. తొలి దశలో రూ. 450 కోట్లు సమకూర్చుకున్నట్లు ఇండిగో వెంచర్స్‌ తెలియజేసింది. 

కాగా.. హైదరాబాద్‌ కేంద్రంగా ఏర్పాటైన ఏరోస్పేస్‌ స్టార్టప్‌ జే ఏరోస్పేస్‌లో తొలి పెట్టుబడికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించింది. అయితే పెట్టుబడి వివరాలు వెల్లడించలేదు. నిధులను అడ్వాన్స్‌డ్‌ డిజిటల్‌ తయారీ మౌలికసదుపాయాలు, ఏఐ ఆధారిత ఉత్పాదకత పెంపు(ప్రొడక్షన్‌ ఆప్టమైజేషన్‌), సరఫరా చైన్‌ వ్యవస్థలను ఏకంచేసే ప్లాట్‌ఫామ్స్‌ అభివృద్ధి, ఇంజినీరింగ్, ప్రొడక్షన్‌ నిపుణులను ఆకట్టుకోవడం తదితరాలకు వినియోగించనున్నట్లు ఇండిగో వెంచర్స్‌ వివరించింది. విమానయానం, తత్సంబంధిత రంగాలలో స్టార్టప్‌లకు ప్రాథమిక దశలో పెట్టుబడులను సమకూర్చేందుకు ఇండిగో వెంచర్స్‌ ఫండ్‌కు తెరతీసింది.  

బీఎస్‌ఈలో ఇండిగో షేరు 0.8 శాతం బలపడి రూ. 5,847 వద్ద ముగిసింది.  
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)