Breaking News

కోర్టు మెట్లెక్కిన ఇండిగో: మహీంద్రా ఎలక్ట్రిక్‌పై దావా

Published on Tue, 12/03/2024 - 20:51

దేశీయ వాహన తయారీ దిగ్గజం ఇటీవల 'బీఈ 6ఈ' ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. మహీంద్రా ఎలక్ట్రిక్ కొత్తగా లాంచ్ చేసిన కారు పేరులో '6ఈ'ని ఉపయోగించడంపై.. భారత విమానయాన సంస్థ ఇండిగో అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టులో దావా వేసింది. మహీంద్రా కంపెనీ ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించింది.

మంగళవారం ఈ కేసు జస్టిస్ 'అమిత్ బన్సల్' ముందుకు వచ్చింది. అయితే ఈయన ఈ కేసు నుంచి తప్పకున్నారు. కాబట్టి విచారణ డిసెంబర్ 9వ తేదీకి వాయిదా పడింది. మహీంద్రా ఎలక్ట్రిక్ ఇండిగోతో సామరస్య పరిష్కారం కోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

ఇండిగో సంస్థ తన బ్రాండింగ్ కోసం మాత్రమే కాకుండా.. ప్రయాణికులకు '6ఈ' పేరుతో సేవలందిస్తోంది. ఎయిర్‌లైన్ 6ఈ ప్రైమ్, 6ఈ ఫ్లెక్స్, బ్యాగేజ్ ఎంపికలు, లాంజ్ యాక్సెస్‌ వంటి వాటి కోసం కూడా 6ఈను ఉపయోగిస్తోంది. ఇప్పుడు మహీంద్రా '6ఈ'ను ఉపయోగించడం పట్ల ఇండిగో కోర్టును ఆశ్రయించింది.

నిజానికి మహీంద్రా ఎలక్ట్రిక్ నవంబర్ 25న 'బీఈ 6ఈ' నమోదు కోసం దరఖాస్తును చేసుకుంది. దీనిని రిజిస్ట్రార్ ఆఫ్ ట్రేడ్‌మార్క్‌ అంగీకరించింది. ద్విచక్ర వాహనాలను మినహాయించి, ఫోర్ వీలర్ వాహనాలకు '6E' హోదాను ఉపయోగించడానికి హక్కులను కంపెనీ సొంతం చేసుకుంది. కాగా ఇప్పుడు ఇండోగో అభ్యంతరం చెబుతోంది. దీనిపై తీర్పు త్వరలోనే వెల్లడవుతుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)