Breaking News

ఇండిగో లాభం ‘హై’జంప్‌

Published on Thu, 05/22/2025 - 07:39

న్యూఢిల్లీ: దేశీ విమానయాన దిగ్గజం ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 62 శాతం దూసుకెళ్లి రూ. 3,067 కోట్లను అధిగమించింది. ఇది క్యూ4లో కంపెనీ సాధించిన రికార్డ్‌ లాభంకాగా.. ఇందుకు విమాన ప్రయాణికులు పెరగడం సహకరించింది. 

అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 1,895 కోట్లు ఆర్జించింది. ఇండిగో బ్రాండ్‌ విమాన సర్వీసుల కంపెనీ మొత్తం ఆదాయం సైతం రూ. 18,505 కోట్ల నుంచి రూ. 23,098 కోట్లకు ఎగసింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 10 చొప్పున డివిడెండ్‌ ప్రకటించింది.  

ప్రయాణికుల జోరు 
మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఇండిగో నికర లాభం రూ. 7,258 కోట్లను అధిగమించింది. విదేశీ మారక ప్రభావాన్ని మినహాయిస్తే దాదాపు రూ. 8,868 కోట్ల లాభం ఆర్జించింది. గతేడాది 11.8 కోట్లమంది ప్రయాణికులను గమ్యాలకు చేరవేసినట్లు సంస్థ సీఈవో పీటర్‌ ఎల్బర్స్‌ పేర్కొన్నారు. 

కాగా.. క్యూ4లో ఇండిగో ప్రయాణికుల టికెట్‌ ఆదాయం 25%  జంప్‌చేసి రూ. 19,567 కోట్లను దాటింది. అనుబంధ విభాగాల ఆదాయం 25 శాతం అధికమై రూ. 2,153 కోట్లకు చేరింది. మొత్తం నగదు నిల్వలు రూ. 48,170 కోట్లను అధిగమించగా.. విమానాల సంఖ్య 400ను దాటింది.  ఇండిగో షేరు బీఎస్‌ఈలో 0.4% లాభంతో రూ. 5,466 వద్ద ముగిసింది.

Videos

73 మంది ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు: YS Jagan

పల్నాడు జిల్లా దాచేపల్లిలో పోలీసుల ఓవరాక్షన్

సీజ్ ది షిప్ అన్నాడు షిప్ పోయింది బియ్యం పోయాయి.. పవన్ పై జగన్ సెటైర్లు..

అక్రమ కేసులు అరెస్టులు ఏపీలో రెడ్ బుక్ బుసలు కొడుతుంది

సుమోలు, కేరళాలు.. గుడ్ ఫ్రెండ్స్ ఏందయ్యా ఈ బ్రాండ్లు..!

రెడ్ బుక్ రాజ్యాంగంలో 390 మంది హత్యకు గురయ్యారు

అందాల యుద్ధం

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడి ఉపనయన వేడుక

రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ తో కాదు.. సుకుమార్ తోనే ..

అల్లు అర్జున్ లేకుండా ఆర్య 3

Photos

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కాన్స్‌లో అదితి : ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)