ఇండిగో సంస్థకు భారీ జరిమానా

Published on Wed, 12/03/2025 - 09:05

విమానయాన సంస్థ ఇండిగోకు జీఎ‍స్టీ అధికారులు భారీ జరిమానా విధించారు. ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌కు సంబంధించి కేరళలోని సీజీఎస్టీ కొచ్చి కమిషనరేట్లోని సెంట్రల్ టాక్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ రూ .117.52 కోట్ల జరిమానా విధించారని, దీన్ని సవాలు చేస్తామని ఇండిగో తెలిపింది.

ఇండిగో రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. జరిమానా 2018-19 నుంచి 2021-22 మధ్య కాలానికి సంబంధించి కంపెనీ పొందిన ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటిసి)ను డిపార్ట్మెంట్ తిరస్కరించింది. దీంతో జరిమానాతో సహా డిమాండ్ ఆర్డర్ జారీ చేసింది. ‘అధికారులు జారీ చేసిన ఉత్తర్వులు తప్పుగా ఉన్నాయని కంపెనీ నమ్ముతోంది. అలాగే బాహ్య పన్ను సలహాదారుల సహాయంతో కేసుపై బలం తమ వైపే ఉంటుందని కంపెనీ విశ్వసిస్తోంది’ అని ఇండిగో ఫైలింగ్‌లో పేర్కొంది.

పన్ను అధికారులు ఇచ్చిన జరిమానా నోటీసును తగిన అధికారుల ముందు సవాలు చేస్తామని తెలిపిన ఇండిగో యాజమాన్యం.. దీని వల్ల తమ ఆర్థిక పరిస్థితులు, నిర్వహణ లేదా ఇతర కార్యకలాపాలపై పెద్ద ప్రభావమేమీ ఉండదని వివరించింది.

ఏమిటీ ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌?
ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) అనేది వ్యాపార సంస్థలు ఇన్‌పుట్లపై చెల్లించిన పన్నులకు క్రెడిట్ క్లెయిమ్ చేయడం ద్వారా పన్ను బాధ్యతను తగ్గించుకునేందుకు అనుమతించే జీఎస్టీ కింద ఒక యంత్రాంగం. ఈ అర్హతను ఆయా వ్యాపార సంస్థలు పొందాయా లేదా అన్నది పన్ను అధికారులు పరిశీలిస్తారు. ఒకే వేళ వ్యత్యాసాలు గుర్తిస్తే ఆ ట్యాక్స్‌ క్రెడిట్‌ను జరిమానాతో సహా తిరిగి వసూలు చేస్తారు.

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)