Breaking News

విమాన కష్టాలు.. ఇండిగో సీఈవో వివరణ

Published on Sat, 12/06/2025 - 14:21

అతిపెద్ద దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో విమానాల రద్దు గందరగోళం కొనసాగుతోంది. శుక్రవారం వరకు సుమారు 1,000 పైగా విమాన సర్వీసులు రద్దు చేసింది. దీంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. విమానాశ్రయాల్లో పడిగాపులు కాస్తున్నారు.  

ఇండిగోలో తలెత్తిన విమానాల రద్దు సంక్షోభంపై దాని సీఈవో సీఈఓ పీటర్ ఎల్బర్స్ స్పందించారు. ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైనట్లు అంగీకరించారు. అంతర్గతంగా తమ అన్ని వ్యవస్థలను, షెడ్యూళ్లను  "రీబూట్" చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రయాణీకులకు క్షమాపణలు చెప్పారు. శనివారం నాటికి విమానాల రద్దు సంఘటనలు తగ్గుతాయని హామీ ఇచ్చారు. రాబోయే 5-10 రోజుల్లో అంటే డిసెంబర్ 10-15 నాటికి క్రమంగా కోలుకుని కార్యకలాపాలు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందన్నారు.

సిబ్బంది పని గంటలను నియంత్రించే కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (ఎఫ్‌డీటీఎల్) నిబంధనలను అమలు చేయడంలో ప్రణాళిక అంతరాల కారణంగా ఈ సంక్షోభం ఉద్భవించిందని వివరణ ఇచ్చారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ఈ నిబంధనలను సమీక్ష పెండింగ్ లో ఉంచింది.
 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)