Breaking News

దేశీయ అతిపెద్ద అంతర్జాతీయ విమానయాన సంస్థగా ఇండిగో

Published on Thu, 09/04/2025 - 12:04

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో భారతదేశపు అతిపెద్ద అంతర్జాతీయ విమానయాన సంస్థగా అవతరించింది. ప్రస్తుతం 43 విదేశీ నగరాలకు విమానాలు నడుపుతూ ఈ ఘనత దక్కించుకుంది. తర్వాతి స్థానంలో ఎయిరిండియా(స్టాండలోన్‌-ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ను మినహాయిస్తే) 42 అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమానాలను నడుపుతోంది.

14 ఏళ్ల క్రితం దిల్లీ-దుబాయ్ మధ్య ఒకే విమానంతో అంతర్జాతీయ ప్రయాణాన్ని ప్రారంభించిన ఇండిగో విమానయాన సంస్థకు ఈ ఘనత ఓ మైలురాయిగా నిలుస్తుందని కంపెనీ అధికారులు చెప్పారు. ఆసియా, మిడిల్‌ఈస్ట్‌, యూరప్‌ అంతటా కొత్త మార్కెట్లలో దూకుడుగా విస్తరించాలన్న ఇండిగో వ్యూహానికి ఇది ప్రేరణగా నిలుస్తున్నట్లు తెలిపారు.

గతంలో ఈ విభాగంలో అగ్రస్థానంలో ఉన్న ఎయిరిండియా ఇటీవల తనకుతాను విధించుకున్న ‘సేఫ్టీ పాజ్‌’, కొన్ని ప్రాంతాల్లో విమానాల రద్దు కారణంగా అంతర్జాతీయ సేవల్లో అంతరాయం నెలకొంది. ఇది ఇండిగోను ముందుంచేలా చేసిందని మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదిలాఉండగా, ఇండిగో 2025 చివరి నాటికి లండన్, కోపెన్ హాగన్, సీమ్ రీప్‌తో సహా అనేక కొత్త మార్గాలను ప్రారంభించాలని యోచిస్తోంది. దేశీయ అంతర్జాతీయ విమాన కార్యకలాపాల్లో ఇండిగో సుమారు 30% వాటాను కలిగి ఉంది. ఈ సంఖ్యను 2030 ఆర్థిక సంవత్సరం నాటికి 40%కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇదీ చదవండి: మొదటిసారి అప్పు చేస్తున్నారా?

#

Tags : 1

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)