Breaking News

భారత్‌లో తగ్గిన నిరుద్యోగం, ఎంతమేర తగ్గిందంటే?

Published on Wed, 06/14/2023 - 08:27

ముంబై: దేశంలో నిరుద్యోగం మే నెలలో తగ్గుముఖం పట్టింది. 7.7 శాతానికి తగ్గినట్టు సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) అనే ప్రైవేటు పరిశోధనా సంస్థ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో ఉపాధి లేమి 8.5 శాతంగా ఉండడం గమనించొచ్చు. ఏప్రిల్‌ నెలతో పోలిస్తే కార్మికుల భాగస్వామ్య రేటు మే నెలలో 1.1 శాతం తగ్గి 39.6 శాతంగా ఉన్నట్టు సీఎంఐఈ పేర్కొంది. ఏప్రిల్‌ నెలలో పెద్ద ఎత్తున పనుల్లోకి చేరడంతో మే నెలలో కార్మికుల భాగస్వామ్య రేటు తగ్గుతుందని అంచనా వేసిందేనని తెలిపింది. (SaradhaChitFundScam: పెట్టుబడిదారుల సొమ్ము రికవరీకి శారదా ఆస్తుల వేలం)

దీనివల్ల మే నెలలో ఉపాధి కోసం అన్వేషించే వారి సంఖ్య తగ్గినట్టు వివరించింది. ఫలితంగా కార్మిక శక్తి 453.5 మిలియన్ల నుంచి 441.9 మిలియన్లకు తగ్గిందని సీఎంఐఈ ప్రకటించింది. కార్మికుల భాగస్వామ్య రేటు పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంది. పట్టణాల్లో పనిచేసే కార్మికులు 4.5 మిలియన్లు తగ్గారు. ఏప్రిల్‌ నెలలో పట్టణాల్లో పనిచేసే కార్మికులు 147 మిలియన్లుగా ఉంటే, మే నెలలో 142.5 మిలియన్లకు తగ్గారు. (MRF బెలూన్లు అమ్మి, కటిక నేలపై నిద్రించి: వేల కోట్ల ఎంఆర్‌ఎఫ్‌ సక్సెస్‌ జర్నీ)

పట్టణాల్లో ఉద్యోగుల సంఖ్యతోపాటు, నిరుద్యోగుల సంఖ్య కూడా తగ్గినట్టు యూఎంఐఈ వెల్లడించింది. పట్టణాల్లో కార్మిక శక్తి 129.5 మిలియన్లుగా ఉంటే, 13 మిలియన్లు నిరుద్యోగులుగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే మాదిరి ఉద్యోగం, నిరుద్యోగం రేటు తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో కార్మికులు 299.4 మిలియన్లుగా మే నెలలో ఉన్నారు. ఏప్రిల్‌లో ఈ సంఖ్య 306.5 మిలియన్లుగా ఉంది. 

మరిన్ని బిజినెస్‌ వార్తలు, సక్సెస్‌ స్టోరీస్‌ కోసం చదవండి: సాక్షిబిజినెస్‌

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు