Breaking News

ఎగుమతులు భారీ పతనం.. మూడేళ్లలో ఇదే తొలిసారి! 

Published on Sat, 07/15/2023 - 10:55

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మందగమన ప్రభావం ముఖ్యంగా అమెరికా, యూరోప్‌ మార్కెట్ల నిరాశావాద ధోరణి భారత్‌ వస్తు ఎగుమతులు–దిగుమతులపై ప్రభావం చూపుతోంది. జూన్‌లో వస్తు ఎగుమతులు 22 శాతం క్షీణించి 32.97 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. గడచిన మూడేళ్లలో (కరోనా సంక్షోభ సమయం 2020 మే నెల్లో 36.47 శాతం క్షీణత) ఇంత స్థాయిలో వస్తు ఎగుమతుల పతనం ఇదే తొలిసారి. ఇక దిగుమతులు కూడా 17.48 శాతం క్షీణించి 53.10 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి ఎగుమతులు దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు జూన్‌లో 20.13 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది.  

తొలి త్రైమాసికంలో క్షీణతే.. 
ఇక ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలల్లో (ఏప్రిల్, మే, జూన్‌) చూస్తే వస్తు ఎగుమతులు 15.13 శాతం క్షీణించి 102.68 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 12.67%క్షీణించి 160.28 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. వెరసి వాణిజ్యలోటు 57.6 బిలియన్‌ డాలర్లుగా ఉంది.  

విభాగాల వారీగా... 

  • జూన్‌లో చమురు దిగుమతుల విలువ 33.8 శాతం తగ్గి 12.54 బిలియన్‌ డాలర్లుగా ఉండగా, ఏప్రిల్‌–జూన్‌ మధ్య 18.52 శాతం క్షీణతతో 43.4 బిలియన్‌ డాలర్లుగా ఉంది.  
  • పసిడి దిగుమతులు జూన్‌లో 82.38 శాతం పెరిగి 5 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికాన్ని చూస్తే, 7.54 శాతం తగ్గి 9.7 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. 
  • జూన్‌లో వెండి దిగుమతులు 94.36 శాతం పడిపోయి 0.79 బిలియన్‌ డాలర్లకు చేరాయి.  
  • జూన్‌ ఎగుమతులకు సంబంధించి 30 కీలక రంగాల్లో 21 క్షీణత నమోదుచేసుకున్నాయి. వీటిలో పెట్రోలియం ఉత్పత్తులు, ప్లాస్టిక్, రెడీమేడ్‌ దుస్తులు, ఇంజనీరింగ్, రసాయనాలు, రత్నాభరణాలు, తోలు, మెరైన్‌ ఉత్పత్తులు ఉన్నాయి.  
  • ఎలక్ట్రానిక్‌ గూడ్స్‌ ఎగుమతులు జూన్‌లో 45.36% పెరిగి 2.43%గా నమోదయ్యాయి. ఏప్రిల్‌–జూన్‌లో ఈ ఎగుమతులు 47% పెరిగి 6.96 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)