ఆయిల్, గ్యాస్‌ బ్లాకుల కోసం పోటాపోటీ

Published on Thu, 09/26/2024 - 07:40

న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ఆయిల్, గ్యాస్‌ బ్లాకుల వేలంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు పాలు పంచుకున్నాయి. ఓపెన్‌ ఎకరేజ్‌ లైసెన్సింగ్‌ పాలసీ (ఓఏఎల్‌పీ–8) ఎనిమిదో దశ వేలంలో భాగంగా కేంద్ర సర్కారు 28 బ్లాకులను వేలానికి పెట్టింది. ఇవి 1.36 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నాయి.

ప్రైవేటు రంగంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌–బీపీ సంస్థలు మొదటిసారి ఓఎన్‌జీసీతో కలసి గుజరాత్‌ తీరంలోని ఓ బ్లాక్‌కు బిడ్‌ వేశాయి. ఓఎన్‌జీసీతోపాటు మరో ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్‌ ఇండియా లిమిటెడ్, వేదాంత, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌–బీపీ జేవీ, సన్‌ పెట్రోకెమికల్స్‌ ఇందులో పాల్గొన్నాయి. ఎనిమిదో విడత ఓఏఎల్‌పీలో 28 బ్లాక్‌లకు బిడ్ల దాఖలు గడువు సెప్టెంబర్‌ 21తో ముగిసింది. దీంతో ఈ వివరాలను డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హైడ్రోకార్బన్స్‌ (డీజీహెచ్‌) విడుదల చేసింది.

ఓఎన్‌జీసీ తాను సొంతంగా 14 బ్లాకులకు బిడ్‌లు దాఖలు చేసింది. ఆయిల్‌ ఇండియా, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌తో కలసి మరో నాలుగు బ్లాక్‌లకు బిడ్లు వేసింది. రిలయన్స్‌–బీపీతో కలసి వేసిన మరో బిడ్‌ కూడా కలిపి చూస్తే మొత్తం 19 బ్లాక్‌లకు ఓఎన్‌జీసీ పోటీ పడుతోంది. ఇక అనిల్‌ అగర్వాల్‌కు చెందిన వేదాంత లిమిటెడ్‌ మొత్తం 28 బ్లాకులకు సొంతంగా బిడ్‌లు సమర్పించింది. సన్‌ పెట్రోకెమికల్స్‌ ఏడు బ్లాకులకు బిడ్‌లు వేసింది. మొత్తం మీద నాలుగు బ్లాక్‌లకు మూడేసి చొప్పున బిడ్లు రాగా, మిగిలిన వాటికి రెండేసి చొప్పున దాఖలయ్యాయి.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)