Breaking News

ఈ కంపెనీ దీపావళికి ఇచ్చిన గిఫ్ట్‌లు చూశారా..?

Published on Thu, 10/16/2025 - 15:36

దీపావళి.. దేశంలో అతిపెద్ద పండుగ. ఈ పర్వదినాన్ని పుస్క‌రించుకుని దేశవ్యాప్తంగా చాలా కంపెనీలు బోనస్‌లు, బహుమతులు (Diwali Gifts) ఇస్తుంటాయి. కొన్ని ‌సం‌స‌‍్థలు కేవలం స్వీట్ బాక్స్ లతోనే స‌రిపెట్టేస్తుంటాయి. మరి కొన్ని కంపెనీలు అయితే అవి కూడా లేకుండా ఉద్యోగులకు వట్టి చేతులు చూపి‌స్తుంటాయి. కేవలం కొన్ని కంపెనీలే తమ ఉద్యోగులకు గుర్తుండిపోయేలా బహుమతులిచ్చి ఆశ్చర్యపరుస్తుంటాయి.

భారతీయ టెక్నాలజీ సంస్థ ఇన్ఫో ఎడ్జ్ (Info Edge) తన ఉద్యోగులకు ఇచ్చిన దీపావళి బహుమతులపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. ఉద్యోగులు స్వయంగా చిత్రీకరించిన అనేక ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వైరల్ అవుతున్నాయి, సంస్థ వారికిచ్చిన రిచ్ గిఫ్ట్ హ్యాంపర్స్‌ను హైలైట్ చేస్తున్నాయి.

వీడియోలలో ప్రతి ఉద్యోగి తమ వర్క్‌స్టేషన్‌ వద్దకు రాగానే, వీఐపీ బ్రాండెడ్ సూట్‌కేస్, స్నాక్స్ బాక్స్, సాంప్రదాయ దీపం (దియా) అమర్చి ఉండటం కనపడుతోంది. ఆఫీసు అంతటా పండుగ శోభను స‌ంతరించుకుని, డెస్కులు అందంగా అలంకరించి ఉన్నాయి.

వైరల్‌గా మారిన దీపావళి గిఫ్ట్ రీల్స్
తమ సంస్థ ఇచ్చిన గిఫ్ట్‌లను చూపుతూ ఉద్యోగులు చేసిన రీల్స్ సోషల్ మీడియా లో వైరల్‌గా మారాయి. ఉద్యోగులు కార్యాలయానికి రాగానే తీసిన వీడియోలలో, బహుమతులను చూస్తూ వారు ఆశ్చర్యపోతున్న క్షణాలు బంధించారు. కొన్ని క్లిప్‌లలో ఉద్యోగులు సూట్‌కేస్ తెరిచి చూపించారు. లోపల మరొక చిన్న సూట్‌కేస్ ఉంది. అలాగే స్నాక్స్ బాక్స్ లను అన్‌బాక్స్ చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. గత ఏడాది కూడా ఈ సంస్థ ఉద్యోగులకు ఎయిర్‌ఫ్రైయర్‌లు బహుమతులుగా ఇచ్చినట్లు తెలిపారు.

నెటిజన్ల స్పందనలు
ఈ వీడియోలు వైరల్ కావడంతో, సోషల్ మీడియా కామెంట్లు వ్యంగ్యంతో పాటు అసూయతో నిండిపోయాయి. “నేను నా ఆఫీస్‌ నుండి వచ్చిన కాజు బర్ఫీ బాక్స్‌ని చూస్తూ ఈ వీడియోను చూస్తున్నాను” ఒకరు కామెంట్‌ చేయగా “దీనిని నా మేనేజర్‌కి చూపించాను. ఆయన ఇది ఏఐ అన్నాడు!” మరో వ్యక్తి హాస్యంగా కామెంట్ చేశారు.

కంపెనీ గురించి..
ఇన్ఫో ఎడ్జ్‌ సంస్థను 1995లో సంజీవ్ బిఖ్చందానీ స్థాపించారు. ఇది నౌకరి, 99ఎకర్‌, జీవన్‌ సాథీ, శిక్షిక.కామ్‌ వంటి ప్రధాన ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌ను నిర్వహిస్తోంది. అలాగే, పలు స్టార్ట్‌అప్‌లలో కూడా పెట్టుబడులు పెట్టింది. సంస్థ ప్రధాన కార్యాలయం నోయిడాలో ఉంది.

ఇదీ చదవండి: ఈ కంపెనీల్లో కెరియర్‌కు తిరుగులేదు! లింక్డ్ఇన్ లేటెస్ట్‌ లిస్ట్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)