Breaking News

రూపాయి 79 ఏళ్ల ప్రస్థానం

Published on Fri, 08/15/2025 - 08:02

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి రేపటితో 79 ఏళ్లు పూర్తవుతాయి. బ్రిటిష్‌ రాచరిక పాలన అంతమైన 1947 సమయంలో ఇండియన్‌ రూపాయి విలువ అమెరికా డాలర్‌తో పోలిస్తే రూ.3.30గా ఉండేది. క్రమంగా అది మారుతూ ప్రస్తుతం రూ.87.65కు చేరింది. ఇలా డాలర్‌ పెరిగి రూపాయి విలువ తగ్గేందుకు చాలా కారణాలున్నాయి. స్వాతంత్ర్యం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు డాలర్‌-రూపాయి పరిణామం ఎలా ఉందనే వివరాలు తెలుసుకుందాం.

రూపాయి విలువను ప్రభావితం చేసే కొన్ని అంశాలు..

వాణిజ్యం: భారత్‌ విదేశాల నుంచి చేసుకునే దిగుమతులు, ఇతర ప్రాంతాలకు చేసే ఎగుమతుల సమతుల్యత వల్ల రూపాయి ప్రభావం చెందుతుంది. ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా చేస్తే రూపాయి విలువ పడిపోతుంది. విదేశీ కరెన్సీలకు డిమాండ్ పెరుగుతుంది.

ద్రవ్యోల్బణం: దేశంలోని అధిక ద్రవ్యోల్బణం వల్ల వస్తువుల కొనుగోలుకు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. దాంతో ద్రవ్యోల్బణం పెరిగి రూపాయి విలువ తగ్గిపోతుంది.

వడ్డీ రేట్లు: అధిక వడ్డీ రేట్లు విదేశీ మూలధనాన్ని ఆకర్షిస్తాయి. రూపాయి విలువను పెంచుతాయి.

విదేశీ మారక నిల్వలు: భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిల్వలు, ఈక్విటీ మార్కెట్‌లోకి వచ్చే ఫారెన్‌ కరెన్సీ వల్ల రూపాయి స్థిరంగా ఉంటుంది. విదేశీ కరెన్సీ రాకపెరిగితే రూపాయి విలువ పెరుగుతుంది.

రాజకీయ, ఆర్థిక పరిస్థితులు: ఆర్థిక వ్యవస్థ స్థిరంగా వృద్ధి చెందాలంటే రాజకీయ అనిశ్చితులు ఉండకూడదు. స్పష్టమైన రాజకీయ నాయకత్వ పరిస్థితులు లేకపోయినా రూపాయి పతనమయ్యే అవకాశం ఉంటుంది.

చమురు ధరలు: భారత్‌ గణనీయంగా చమురును దిగుమతి చేసుకుంటోంది. అందుకోసం డాలర్లు చెల్లించాల్సిందే. భారత్‌ వద్ద ఉన్న ఫారెన్స్‌ కరెన్సీ రిజర్వులు అందులో ఉపయోగపడుతాయి. అయితే చమురు ధరలు పెరగితే చెల్లింపులు ఎక్కువ చేయాల్సి ఉంటుంది. దాంతో డాలర్‌ విలువ పెరిగి రూపాయి విలువ తగ్గుతుంది.

కొన్ని నివేదికల ప్రకారం.. 1947లో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి ఎక్సేంజ్‌ రేట్‌ రూ.3.30గా ఉండేది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ విలువ క్రమంగా పడిపోయింది. 1947 నుంచి 2025 వరకు ఇండియన్ రూపాయి పరిణామక్రమం కింది విధంగా ఉంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)