Breaking News

ట్రంప్‌ అదనపు డ్యూటీల ప్రస్తావన.. రూపాయి నేలచూపు

Published on Tue, 07/08/2025 - 10:43

డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ తాజాగా 54 పైసలు పతనమైంది. దాంతో 85.94 వద్ద ముగిసింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి ట్రేడింగ్‌ 85.53 వద్ద ప్రారంభమైంది. తదుపరి 85.51–86.03 మధ్య ఆటుపోట్లను చవిచూసింది. ప్రపంచ కరెన్సీలతో డాలరు బలపడటం, యూఎస్‌ టారిఫ్‌ల గడువు దగ్గరపడటం తదితర అంశాలు రూపాయిని దెబ్బతీసినట్లు ఫారెక్స్‌ వర్గాలు పేర్కొన్నాయి.

బ్రిక్స్‌ సదస్సు నేపథ్యంలో యూఎస్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ఆయా దేశాలపై 10% అదనపు డ్యూటీలను విధించనున్నట్లు ప్రకటించడం సైతం రూపాయిపై ప్రభావం చూపినట్లు తెలియజేశారు. కాగా, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 0.25 శాతం పుంజుకుని 97.41కు చేరింది. రూపాయి విలువ ఎలాంటి సందర్భాల్లో ఎలా ఉంటుందో నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి: ‘పాస్‌వర్డ్‌ సరైందే! ఎందుకు లాగిన్‌ అవ్వట్లేదు’

  • టారిఫ్‌లు వేయడం రూపాయికి ప్రతికూలంగా మారుతుంది. ఎగుమతులు తగ్గిపోతాయి.

  • కొత్తగా ఇతర దేశాలతో చేసుకునే కాంట్రాక్ట్‌లు రూపాయి విలువకు ఊతం ఇస్తాయి.

  • భారత్‌ వంటి చమురు దిగుమతి చేసుకునే దేశాలకు వాటి ధరలు పెరగడం నెగిటివ్‌గా ఉంటుంది.

  • ఆర్‌బీఐ జోక్యం చేసుకొని రూపాయి విలువను స్థిరీకరిస్తుంది.

  • గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్‌ కూడా రూపాయి విలువను ప్రభావితం చేస్తుంది.

  • ట్రంప్ టారిఫ్ వైఖరి మళ్లీ కఠినతరంగా మారితే లేదా భారత్ విస్తృత వాణిజ్య ఉద్రిక్తతల్లోకి వెళితే రూపాయి మరింత ఒత్తిడిని ఎదుర్కోవచ్చు.
     

Videos

కొండేపిలో నూతన YSRCP ఆఫీస్ ప్రారంభం

అనకాపల్లి జిల్లాలో అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్న వెంగమాంబ క్రషర్ స్టోన్

మూడు గంటలకు పైగా ఎంపీ P.V మిథున్ రెడ్డిని - విచారిస్తున్న సిట్

Nallakunta: ప్రతి సంవత్సరం వర్షం వస్తే ఇదే పరిస్థితి అంటూ కాలనీవాసుల ఆవేదన

శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ఉధృతి

ఐర్లాండ్ లో బయటపడిన భయానక రహస్యం

కుండబద్దలుకొట్టిన DGలు

అమెరికా రాజకీయాలను కుదిపేస్తున్న జెఫ్రీ ఎప్‌స్టీన్‌ కేసు

దమ్ముంటే ఆధారాలు చూపించండి.. లిక్కర్ కేసుపై శైలజానాథ్ రియాక్షన్

Visakhapatnam: ఐటీసీ గోడౌన్ లో చెలరేగిన మంటలు

Photos

+5

కొంపల్లిలో సందడి చేసిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఐఎన్‌ఎస్‌ నిస్తార్‌ జాతికి అంకితం (ఫొటోలు)

+5

ట్రైలర్ లాంచ్ ఈవెంటో మెరిసిన నటి డింపుల్ హయాతీ (ఫొటోలు)

+5

విజయవాడ : సారె తెచ్చి..మనసారా కొలిచి..కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

జడివానకు హైదరాబాద్‌ అతలాకుతలం.. ట్రాఫిక్‌ జామ్‌తో చుక్కలు చూసిన వాహనదారులు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన..చెరువుల్లా మారిన రోడ్లు (ఫొటోలు)

+5

‘నా సీతా సీమంతం’ శ్రీమతి సీమంతంపై బిగ్‌బాస్‌ ఫేం పోస్ట్‌ (ఫొటోలు)

+5

‘నేను నా శివయ్య’ అంటున్న ఈ భక్తురాల్ని చూశారా?

+5

చందమామలా.. చీర సింగారించుకుని క్యూట్‌గా తెలుగు బ్యూటీ!

+5

ఆంధ్రా సరిహద్దులో.. ఉరకలేస్తున్న జలపాతాలు(చిత్రాలు)