Breaking News

వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్లపై రైల్వే కీలక నిర్ణయం

Published on Wed, 06/11/2025 - 18:29

రైలు ప్రయాణం అంటే చివరి వరకూ టెన్షనే.. ముఖ్యంగా వెయిటింగ్‌ లిస్ట్‌ ప్రయాణికులకైతే తమ టికెట్లు కన్ఫర్మ్‌ అవుతాయా లేదా అన్నది రైలు బయలుదేరేంత వరకూ గందరగోళమే. ఈ తికమకను తొలగించడానికి భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైలు బయలుదేరేందుకు 24 గంటల ముందే తుది చార్టును సిద్ధం చేయాలని నిర్ణయించింది.

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మే 21న బికనీర్ పర్యటన సందర్భంగా ఈ ఆలోచన వచ్చింది. చివరి నిమిషంలో గందరగోళాన్ని తగ్గించడానికి ముందుగానే చార్ట్ ను సిద్ధం చేయాలని స్థానిక రైల్వే అధికారులు సూచించారు. ఇప్పటివరకూ రైలు బయలుదేరడానికి 2.3 గంటల నుండి 4 గంటల ముందు మాత్రమే తుది చార్ట్ తయారు చేస్తున్నారు. దీంతో ప్రయాణికుల్లో అనిశ్చితి నెలకొంది.

👉ఇదీ చదవండి: తత్కాల్‌ టికెట్లకు ఆధార్‌ తప్పనిసరి

తుది చార్ట్‌ను 24 గంటల ముందే అందుబాటులోకి తేవాలన్న ఆలోచనకు మంత్రి వెంటనే ఆమోదం తెలపడంతో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. బికనీర్ డివిజన్లో జూన్ 6 నుంచి ప్రయోగాత్మకంగా ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ ట్రయల్ ప్రారంభ ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. మొదటి నాలుగు రోజుల్లోనే ప్రయాణికులు మెరుగైన స్పష్టతను చూశారు. టికెట్‌ కన్ఫర్మ్‌ కాని ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేందుకు ఎక్కువ సమయం లభించింది. బికనీర్ ట్రయల్ విజయవంతమైన తరువాత, భారతీయ రైల్వే ఇప్పుడు ఈ విధానాన్ని ఇతర అధిక ట్రాఫిక్ మార్గాలకు విస్తరించాలని యోచిస్తోంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)