Breaking News

హైడ్రోజన్ రైలుపై తప్పుడు ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన రైల్వే!

Published on Mon, 07/20/2026 - 16:10

భారతదేశంలో ప్రారంభమైన తొలి హైడ్రోజన్ రైలుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇందులో హైడ్రోజన్ ఇంజిన్ రైలును.. డీజిల్ ఇంజిన్‌ లాగుతున్నట్లు కనిపిస్తుంది. దీనిపై రైల్వే స్పందించి క్లారిటీ ఇచ్చింది.

రైల్వే శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. దేశంలోని తొలి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026 జూలై 17న ప్రారంభించారు. ఈ రైలు హర్యానాలోని జింద్ నుంచి సోనిపట్ వరకు 89 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ మార్గంలో రైలు పూర్తిగా హైడ్రోజన్ ఇంధనంతోనే నడుస్తుంది.

అయితే.. ఈ రైలుకు అవసరమైన మెయింటెనెన్స్ మొత్తం షకుర్‌బస్తీ వర్క్‌షాప్‌లో జరుగుతుంది. అందువల్ల జింద్ నుంచి షకుర్‌బస్తీ వరకు రైలును నడపకుండా, ఒక లోకోమోటివ్ సహాయంతో లాగి తీసుకెళ్తారు. ఇది చాలా కాలంగా అమలులో ఉన్న సాధారణ రైల్వే విధానం. కొందరు దీనిని చూసి హైడ్రోజన్ ఇంజిన్ చెడిపోయిందని తప్పుగా ప్రచారం చేశారు.

ఇదీ చదవండి: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలు.. టికెట్ ధర ఎంతంటే?

రైల్వే బోర్డు కూడా ముందుగానే విడుదల చేసిన ఉత్తర్వుల్లో, ఈ రైలు జింద్-సోనిపట్ మార్గంలో మాత్రమే స్వయంగా నడుస్తుందని, నిర్వహణ కోసం ఇతర ప్రాంతాలకు తరలించేటప్పుడు లోకోమోటివ్‌తో లాగాలని స్పష్టంగా పేర్కొంది. కాబట్టి వైరల్ వీడియోలో చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని రైల్వే వెల్లడించింది.

Videos

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)