Breaking News

ఈ యువరాజు దగ్గర లేని కారు లేదు!

Published on Mon, 12/02/2024 - 13:59

విలాసవంతమైన జీవనశైలితో తరచూ వార్తల్లో ఉండే ఉదయపూర్ యువరాజు లక్ష్యరాజ్ సింగ్ మేవార్ (Lakshyaraj Singh Mewar) ఖరీదైన కార్ల భారీ కలెక్షన్‌కు కూడా ప్రసిద్ధి చెందారు. వింటేజ్‌ కార్ల దగ్గర నుంచి లేటెస్ట్‌ రోల్స్‌ రాయిస్‌ కార్ల వరకూ ఆయన దగ్గర లేని కారు అంటూ లేదంటే అతిశయోక్తి కాదేమో..

లేటెస్ట్‌ లగ్జరీ కార్లను ఇష్టపడే లక్ష్యరాజ్‌ సింగ్‌కు పాతకాలపు కార్ల పట్ల కూడా మక్కువ ఎక్కువే. తన విస్తారమైన కార్ల కలెక్షన్‌ను చూస్తే ఇది తెలుస్తుంది.  ఇంకా తన కార్ల కలెక్షన్‌లో వలసరాజ్యాల కాలం నాటి క్లాసిక్ కార్లతోపాటు అత్యంత ఖరీదైన రోల్స్‌ రాయిస్‌ కార్లు కూడా ఉన్నాయి.

ఆనంద్‌ మహీంద్రా నుంచి..
విదేశీ లగ్జరీ కార్ల పట్ల అభిమానంతోపాటు లక్ష్యరాజ్ సింగ్‌కు కొన్ని మేడ్ ఇన్ ఇండియా వాహనాలు ముఖ్యంగా మహీంద్రా థార్ ఎస్‌యూవీ అంటే అమితమైన ఇష్టం. 2019లో మహీంద్రా థార్ 700 లిమిటెడ్‌ ఎడిషన్‌ లాంచ్‌ అయినప్పుడు మహీంద్రా అండ్ మహీంద్రా చైర్‌పర్సన్ ఆనంద్ మహీంద్రా స్వయంగా వాహనాన్ని యువరాజుకు అందించారు. ఈ పరిమిత ఎడిషన్ ఈ వాహనాలు 700 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి అయ్యాయి.

విస్తృతమైన కార్ల సేకరణతో పాటు లక్ష్యరాజ్ సింగ్ మోటార్ సైకిళ్లను కూడా ఇష్టపడతారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్‌ అయిన బీఎస్‌ఏ గోల్డ్ స్టార్ 650 బైక్‌ని కొన్న తొలి వ్యక్తి ఆయనే. భారత్‌లో ఈ క్రూయిజర్ మోటార్‌బైక్ ధర సుమారు రూ. 3.37 లక్షలు.

లక్ష్యరాజ్ సింగ్ మేవార్ ఉదయ్‌పూర్ యువరాజుగా పట్టాభిషిక్తుడైనప్పటికీ, రాజ సింహాసనానికి సరైన వారసుడి విషయంలో వివాదం కొనసాగుతోంది. ఈ విషయంలో ఇటీవల రాజకుటుంబీకుల మధ్య మళ్లీ ఘర్షణలు జరిగాయి. రాజస్థాన్‌లోని మేవార్ల సంపద దాదాపు రూ. 10,000 కోట్లని మీడియా నివేదికల అంచనా.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)