Breaking News

ఔషధ ఎగుమతులు @10 బిలియన్‌ డాలర్లు

Published on Sun, 10/20/2024 - 00:48

న్యూఢిల్లీ: భారత్‌ నుంచి ఔషధ ఎగుమతులకు యూఎస్, యూరప్‌ కీలక మార్కెట్లుగా నిలుస్తున్నా యి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో (ఏప్రిల్‌–ఆగస్ట్‌) ఫార్ములేషన్స్, బయోలాజికల్స్‌ ఎగుమతులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 10.8% పెరిగి 9.42 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. సర్జికల్‌ ఉత్పత్తుల ఎగుమతులు 3.3% వృద్ధితో 0.29 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యా యి. 

ఈ గణాంకాలను కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసింది. ఫార్మా మార్కెట్లో విశ్వసనీయమైన సరఫరాదారుగా భారత్‌కు ప్రాముఖ్యత పెరుగుతున్నట్టు ఈ డేటా స్పష్టం చేస్తోంది. ‘‘పా ర్మాస్యూటికల్‌ ఫార్ములేషన్స్, బయోలాజికల్‌ ఉత్పత్తుల్లో అంతర్జాతీయంగా భారత్‌ స్థానం పటిష్టమవుతోంది. అంతర్జాతీయంగా జనరిక్స్, వినూత్నమైన చికిత్సలకు డిమాండ్‌ పెరగడంతోపాటు, భారత్‌లో అత్యున్నత ప్రమాణాలతో కూడిన తయారీ ఇందుకు మద్దతుగా నిలుస్తోంది’’అని వివరించింది.  

వివిధ దేశాలకు ఎగుమతులు ఇలా.. 
→ భారత్‌ నుంచి ఫార్ములేషన్లు, బయోలాజికల్స్‌ ఉత్పత్తుల ఎగుమతుల్లో 39% అమెరికాకు వెళ్లా యి. ఏప్రిల్‌ నుంచి ఆగస్ట్‌ వరకు 3.69 బిలియన్‌ డాలర్ల విలువైన ఉత్పత్తులను భారత కంపెనీలు అమెరికాకు షిప్‌ చేశాయి. అమెరికాలో జనరిక్స్, ప్రాణాలను రక్షించే ఔషధాలకు డిమాండ్‌ పెరుగుతుండడం కలిసొస్తోంది. 

→ అమెరికా తర్వాత యూకేకు అత్యధికంగా 316.2 మిలియన్‌ డాలర్ల విలువైన ఫార్ములేషన్లు, బయోలాజికల్స్‌ ఎగుమతులు నమోదయ్యాయి. యూకే వాటా 3.4 శాతంగా ఉంది. దక్షిణాఫ్రికాకు 268 మిలియన్‌ డాలర్లు (2.8 శాతం), ఫ్రాన్స్‌కు 243 మిలియన్‌ డాలర్లు (2.6 శాతం), కెనడాకు 197 మిలియన్‌ డాలర్లు (2.1 శాతం) విలువ చేసే ఔషధ ఫార్ములేషన్లు, బయోలాజికల్స్‌ ఎగుమతయ్యాయి.  

→ మధ్యప్రాచ్యంలో ఇరాక్‌కు 86.5 మిలియన్‌ డా లర్ల విలువ చేసే ఉత్పత్తులను భారత ఫార్మా సంస్థలు ఎగుమతి చేశాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఎగుమతులు 43.5 మిలియన్‌ డాలర్లతో పోలి్చతే రెట్టింపయ్యాయి.  

→ నాణ్యతా ప్రమాణాలతో కూడిన భారత సర్జికల్‌ ఉత్పత్తులకు సైతం అంతర్జాతీ య మార్కెట్లో ఆదరణ అధికమవుతోంది. గడిచిన ఐదేళ్ల నుంచి ఎగుమతులు స్థిరంగా పెరుగుతున్నాయి. 2019–20లో 0.45 బిలియన్‌ డా లర్ల ఎగుమతులు నమోదు కాగా, 2023 –24లో ఇవి 0.70 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. 

→ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో భారత్‌ నుంచి ఎగుమతి అయిన సర్జికల్‌ ఉత్పత్తుల్లో 53 మిలియన్‌ డాలర్లు (18.1 శాతం) యూఎస్‌కే వెళ్లాయి. జర్మనీకి 13.5 మిలియన్‌ డాలర్లు (4.6 శాతం), బ్రిటన్‌కు 13.4 మిలియన్‌ డాలర్ల చొప్పున సర్జికల్‌ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి.  
 

Videos

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు