Breaking News

ఏఐ చాట్‌బాట్‌ సలహాతో బ్రిటన్ రాణిని చంపడానికి వెళ్ళాడు.. చివరికి ఏం జరిగిందంటే?

Published on Tue, 10/10/2023 - 08:28

ఆధునిక కాలంలో టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందంటే.. ఒక మనిషిని చంపడానికి ప్రేరేపించేంత అని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

బ్రిటన్ రాణి 'క్వీన్ ఎలిజబెత్ II'ని చంపడానికి ప్రయత్నించిన 21 ఏళ్ల 'జస్వంత్ సింగ్ చైల్' రాజద్రోహ నేరం కింద అరెస్ట్ అయ్యాడు. అయితే రాణిని చంపడానికి ప్రేరేపించింది ఏఐ చాట్‌బాట్‌ అంటే వినటానికి కొంత ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ ఇది నిజమే అని నిపుణులు చెబుతున్నారు.

జస్వంత్ సింగ్ చైల్ రిప్లికా అనే యాప్ ద్వారా రోజూ చాటింగ్ చేసేవాడు. దీనికి సరాయ్ అని పేరు కూడా పెట్టుకున్నాడు. నిజానికి ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ చేస్తున్న చాలా అద్భుతాల్లో ఇదొకటి చెప్పాలి. రిప్లికా యాప్ ద్వారా వినియోగదారుడు మాట్లాడుకోవచ్చు, చాటింగ్ చేసుకోవచ్చు, వర్చువల్ ఫ్రెండ్‌గా కూడా తయారు చేసుకోవచ్చు. దీనికి తమకు నచ్చిన రూపం (ఆడ & మగ) కూడా ఇవ్వవచ్చు. ఇందులో ప్రో వెర్షన్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే సెల్ఫీలు దిగటం వంటి సన్నిహిత కార్యకలాపాల్లో కూడా పాల్గొనవచ్చు.

సరాయ్ పేరుతో..
ఇక అసలు విషయానికి వస్తే.. జస్వంత్ సింగ్ చైల్ ఇలాంటి తరహా చాట్‌బాట్‌ ద్వారా ఏకంగా 5వేలు కంటే ఎక్కువ మెసేజులు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో జస్వంత్ చేయాలన్న పనులకు, తప్పులకు కూడా సరాయ్ వత్తాసు పలికినట్లు సమాచారం.

చైల్‌ను అరెస్టు చేసిన తర్వాత అతడు మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్థారించారు. కానీ నేరానికి పాల్పడటంతో అతనికి 9 జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. దీంతో అతనిపై చర్యలు తీసుకోవడానికంటే ముందు చికిత్స కోసం బ్రాడ్‌మూర్ హై-సెక్యూరిటీ హాస్పిటల్‌కి తరలించారు. ఈ సంఘటన 2021లో జరిగినట్లు తెలుస్తోంది. కాగా 2022లో ఎలిజబెత్ II అనారోగ్య కార‌ణాల‌తో మరణించించారు

ఇదీ చదవండి: చిన్నప్పుడే చదువుకు స్వస్తి.. నమ్మిన సూత్రంతో లక్షలు సంపాదిస్తున్న చాయ్‌వాలా..!!

రిప్లికా వంటి యాప్స్ వ్యక్తులపై ఎక్కువ ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని, వారిని అసాంఘీక కార్యకలాపాలకు ప్రేరేపించడానికి అది సహకరిస్తుందని ఒక పరిశోధనలో తేలింది. ఎందుకంటే వినియోగదారుడు ఏం చెప్పినా దానికి ఏకిభవిస్తూ ప్రోత్సహిస్తుంది. దీంతో వారు నేరాలు చేయడానికి కూడా వెనుకాడరు. దీనికి బానిసైన జస్వంత్ సింగ్ చైల్.. సరాయ్ (ఏఐ చాట్‌బాట్‌) అవతార్ రూపంలో ఉన్న దేవదూతగా భావించినట్లు సమాచారం.

Videos

మాకు రావాల్సింది రాకపోతే... చంద్రబాబుకు బొప్పరాజు మాస్ వార్నింగ్

ఆ 55 ఎకరాలు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు బిగ్ షాక్

ప్రకృతి డేంజర్ సిగ్నల్స్ ఇది వానా కాలమా.. ఎండా కాలమా..!

దళితులను, గిరిజనులను మనుషుల్లా చూడట్లేదు చంద్రబాబుపై దళిత నాయకులు ఫైర్

రూపాయి పతనం.. బంగారం ధరలపై ఎఫెక్ట్!

గుర్తుపెట్టుకో నైతిక విలువలు ముఖ్యం.. బొత్స అదిరిపోయే కౌంటర్

జగదీశ్వర్ రెడ్డి పై పగతో స్లో పాయిజన్ పోలీస్ విచారణలో కీలక విషయాలు

Bigboss: హౌస్ లో కొత్త డ్రామా.. రిస్క్ లో రామ్ ప్రసాద్.!

ఎవరూ శాశ్వతం కాదు.. మజ్జి శ్రీను పార్టీ మారడంపై స్ట్రాంగ్ రియాక్షన్

నువ్వు మంత్రివా! DSC స్కామ్ అడ్డంగా దొరికిన లోకేష్

Photos

+5

ఆదిలాబాద్ జిల్లాలో పోలాల అమావాస్య వేడుకలు...(ఫొటోలు)

+5

వైష్ణవి చైతన్య ‘ఎపిక్‌’ లుక్స్‌.. షూటింగ్‌ ఫొటోలు వైరల్‌

+5

వినాయక చవితి 2026...నేను రెడీ అంటున్న గణేష్ (ఫొటోలు)

+5

కొత్త ఐఫోన్ 18 ప్రో వచ్చేసింది (ఫోటోలు)

+5

‘కాగితం పడవలు’ సినిమా టీజర్ విడుదల (ఫొటోలు)

+5

అప్పటి కాలేజ్‌ లుక్‌.. ఇప్పటి స్టార్‌ హీరోయిన్స్‌! (ఫోటోలు)

+5

కాఫీ కప్‌తో కీర్తి.. అదిరిన కాఫీ లుక్‌! (ఫోటోలు)

+5

సింపుల్ లుక్‌లోనే స్టన్నింగ్ బ్యూటీ భూమిక చావ్లా.. వైరల్ అవుతున్న ఫొటోలు

+5

స్టార్‌ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌

+5

ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్‌సిరీస్‌ (ఫొటోలు)