Breaking News

400 మంది ఉద్యోగులను కోటీశ్వరులను చేశాడు!

Published on Thu, 10/17/2024 - 14:29

సాధారణంగా కంపెనీల అధినేతలు తమ సొంత ప్రయోజనాల కోసమే ఆలోచిస్తారు. ఉద్యోగులను ప్రయోజనాలను పట్టించుకోరు. కానీ ఓ కంపెనీ ఫౌండర్‌ తీసుకున్న నిర్ణయం ఆ సంస్థలోని 400 మంది ఉద్యోగులను కోటీశ్వరులను చేసింది.

భారతీయ సంతతికి చెందిన జ్యోతి బన్సల్ తన మొదటి సాఫ్ట్‌వేర్ స్టార్టప్ యాప్‌డైనమిక్స్‌ను 2017లో విక్రయించినప్పుడు తన కెరీర్‌లో అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. తన స్టార్టప్‌ను 3.7 బిలియన్ డాలర్లకు (ప్రస్తుత విలువ రూ. 31,090 కోట్లు) సిస్కోకు విక్రయించడం అప్పుడు సరైన నిర్ణయమేనని ఆయన భావించారు. కంపెనీలో 14 శాతానికి పైగా వాటా ఉన్న బన్సల్‌కు కూడా ఈ ఒప్పందం ఆర్థికంగా ముఖ్యమైనది. 

సిస్కో ఆఫర్‌ను అంగీకరించిన తర్వాత 400 మంది యాప్‌డైనమిక్స్‌ ఉద్యోగుల షేర్స్ విలువ ఒక మిలియన్‌ డాలర్లకు ఎగబాకినట్లు బన్సల్ ప్రతినిధి తెలిపారు. దీంతో వీరందరూ కోటీశ్వరులయ్యారు.

అప్లికేషన్స్ అండ్‌ బిజినెస్ పెర్ఫార్మెన్స్ మానిటరింగ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ అయిన యాప్‌డైనమిక్స్‌ను జ్యోతి బన్సల్‌ 2008లో స్థాపించారు. ఈ స్టార్టప్ సరిగ్గా ఐపీఓకి వచ్చే ఒక రోజు ముందు విక్రయించారు. ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్థి అయిన బన్సాల్ ప్రస్తుతం ట్రేసబుల్, హార్నెస్ అనే మరో రెండు సాఫ్ట్‌వేర్ స్టార్టప్‌లకు సీఈవో, కో ఫౌండర్‌.

ఎవరీ జ్యోతి బన్సల్‌?
జ్యోతి బన్సల్‌ రాజస్థాన్‌లోని ఒక చిన్న పట్టణంలో పుట్టి పెరిగారు. ఆయన తండ్రి నీటిపారుదల యంత్రాలను విక్రయించే వ్యాపారం చేసేవాడు. 1999లో ఢిల్లీ ఐఐటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. నెక్ట్స్‌ జనరేషన్‌ టెక్నాలజీ అభివృద్ధిలో మక్కువ ఉన్న జ్యోతి బన్సల్‌ 2017లో ఆయన బిగ్‌ ల్యాబ్స్‌ను ప్రారంభించారు. 2018లో జాన్ వ్రియోనిస్‌తో కలిసి అన్‌యూజవల్‌ వెంచర్స్‌ను సహ-స్థాపించారు. జ్యోతి బన్సల్‌ ప్రస్తుతం యూఎస్‌లోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)