Breaking News

గేమింగ్‌.. జూమింగ్‌

Published on Sat, 10/19/2024 - 04:05

న్యూఢిల్లీ: దేశంలో గేమింగ్‌ పరిశ్రమ రానున్న మూడేళ్లలో రెట్టింపు కానుంది. 2028 నాటికి రూ.66,000 కోట్లకు చేరుకుంటుందని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక వెల్లడించింది. తద్వారా ఈ రంగంలో రెండు నుంచి మూడు లక్షల మందికి అదనంగా ఉపాధి లభిస్తుందని అంచనా వేసింది. ఆర్థికాభివృద్ధికి తోడు, సాంస్కృతిక వైభవం గేమింగ్‌ పరిశ్రమ వృద్ధికి మద్దతుగా నిలుస్తున్నట్టు తెలిపింది. ‘ఫ్రమ్‌ సన్‌రైజ్‌ టు సన్‌షైన్‌:..’ పేరిట భారత గేమింగ్‌ పరిశ్రమపై పీడబ్ల్యూసీ ఇండియా ఒక నివేదిక విడుదల చేసింది. ఢిల్లీలో ఇండియా గేమింగ్‌ కన్వెన్షన్‌ ఇందుకు వేదికగా నిలిచింది. ఈ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటికి పరిష్కారాలను సూచించింది. 

ఏటా 15 శాతం చొప్పున.. 
భారత ఆన్‌లైన్‌ గేమింగ్‌ మార్కెట్‌ 2023 నాటికి రూ.33,000 కోట్లుగా ఉంది. 2023 నుంచి 2028 వరకు ఏటా 14.5 శాతం చొప్పున కాంపౌండ్‌ అవుతూ రూ.66,000 కోట్లకు చేరుకుంటుంది. ఈ సామర్థ్యాన్ని చేరుకోవడానికి వీలుగా అవకాశాలను సొంతం చేసుకోవాలంటే అందుకు పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించాలి.  

ఆన్‌లైన్‌ గేమింగ్‌లో అదిపెద్ద ఉప విభాగమైన రియల్‌ మనీ గేమింగ్‌  మార్కెట్‌ 2028 నాటికి రూ.26,500 కోట్లకు చేరుకోవచ్చు. గేమింగ్‌ పరిశ్రమ వచ్చే కొన్నేళ్లలో ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో 2–3 లక్షల మందికి ఉపాధికలి్పంచడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థపై చెప్పుకోతగ్గ ప్రభావాన్ని చూపిస్తుంది.  

సవాళ్లు–మార్గాలు.. 
గేమింగ్‌ రంగం వృద్ధి ప్రధానంగా పన్ను అంశాల పరిష్కారం, నియంత్రణపరమైన స్పష్టతపైనే ఆధారపడి ఉంటుందని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక స్పష్టం చేసింది. నియంత్రణ పరమైన అనుసంధాన లేమి, అధిక జీఎస్‌టీ కారణంగా నిలకడలేని వ్యాపార నమూనా, గేమింగ్‌ మానిటైజేషన్‌ విషయంలో ఉన్న నైతిక అంశాలు, నైపుణ్యాల అంతరం, భాగస్వాముల ప్రయోజనాల విషయంలో సమతుల్యం, గేమర్ల మానసిక ఆరోగ్యం, ప్లేయర్ల ఎంగేజ్‌మెంట్, సాంస్కృతిక సంబంధిత గేమ్‌ల రూపకల్పన, గేమింగ్‌ కెరీర్‌ పట్ల సమాజంలో ఉన్న భావనలు మార్చడం, చట్టవిరుద్ధమైన గ్యాంబ్లింగ్‌ను కట్టడి చేయడం వంటి సవాళ్లను ప్రస్తావించింది.  
 
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)