Breaking News

భారత్‌ వృద్ధి అంచనాకు ఏడీబీ కోత

Published on Thu, 09/21/2023 - 06:14

న్యూఢిల్లీ: భారత్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023 ఏప్రిల్‌–24మార్చి) జీడీపీ వృద్ధి రేటు తొలి అంచనాలను ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ స్వల్పంగా తగ్గించింది. 2023 ఏప్రిల్‌ అవుట్‌లుక్‌  6.4 శాతం అంచనాలను తాజాగా 10 బేసిస్‌ పాయింట్లు తగ్గి స్తున్నట్లు తెలిపింది. దీనితో ఈ అంచనా 6.3 శాతానికి తగ్గినట్లయ్యింది.

ఎగుమతుల్లో మందగమనం, తగిన వర్షపాతం లేక వ్యవసాయంపై ప్రభావం వంటి అంశాలు తమ అంచనాల కోతకు కారణ మని తన 2023 సెపె్టంబర్‌ అవుట్‌లుక్‌లో తెలిపింది. కాగా 2024–25 అంచనాలను 6.7 శాతంగా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రైవేటు పెట్టుబడులు, దేశీయ వినియోగం, ప్రభ్తువ మూలధన వ్యయాలు వృద్ధికి భరోసాను ఇస్తున్నట్లు తెలిపింది.  

5.9 శాతం నుంచి 6.2 శాతానికి అప్‌: ఇండియా రేటింగ్స్‌
మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 5.9 శాతం వృద్ధి అంచనాలను 6.2 శాతానికి పెంచుతున్నట్లు ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. ప్రభుత్వ మూలధన పెట్టుబడులు పెరగడం, బ్యాంకులు, కార్పొరేట్ల మెరుగైన బ్యాలెన్స్‌ షీట్లు, గ్లోబల్‌ కమోడిటీ ధరలు తగ్గడం, ప్రైవేటు పెట్టుబడుల్లో ఉత్తేజం తన రేటింగ్‌ మెరుగుదలకు కారణమని ఈ మేరకు విడుదలైన ఒక నివేదికలో ఇండియా రేటింగ్స్‌ ప్రధాన ఎకనమిస్ట్‌ సునిల్‌ కుమార్‌ పేర్కొన్నారు.   (రూ.400 కోట్లకు అలనాటి మేటి హీరో బంగ్లా అమ్మకం: దాని స్థానంలో భారీ టవర్‌?)

మన ఎకానమీకి ఢోకా లేదు: అషీమా గోయెల్‌
ఇదిలావుండగా, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లోనూ భారత్‌ ఎకానమీ చక్కని పనితీరు ప్రదర్శిస్తోందని ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధన కమిటీ (ఎంపీసీ) సభ్యుల్లో ఒకరైన అషీమా గోయెల్‌ పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న పలు సంస్కరణాత్మక చర్చలు, ఆర్‌బీఐ విధానాలు దేశ ఎకానమీకి తగిన బాటన నడుపుతున్నట్లు వివరించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)