Breaking News

ప్రాణాలు తీస్తున్న దగ్గు సిరప్!.. క్వాలిటీ టెస్ట్‌లో షాకింగ్ విషయాలు

Published on Wed, 07/24/2024 - 16:49

దగ్గుకు వాడుతున్న సిరప్‌లు ప్రాణాంతకం.. మరణానికి దారితీసే అవకాశం ఉందని.. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) వెల్లడించింది. 100 కంటే ఎక్కువ ఫార్మా యూనిట్ల నుంచి సేకరించిన దగ్గు సిరప్ నమూనాలు, క్వాలిటీ టెస్టులో విఫలమయ్యాయని నివేదికలో స్పష్టం చేసింది.

పరీక్షించిన చాలా సిరప్‌లలో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు వెల్లడైంది. డైథలీన్ గ్లైకాల్ (DEG), ఇథిలీన్ గ్లైకాల్ (EG) పీహెచ్ వంటివన్నీ తగిన పరిమితులలో లేదని నివేదికలో పేర్కొన్నారు. మొత్తం 7,087 బ్యాచ్‌ల మందులను పరీక్షిస్తే.. 353 బ్యాచ్‌లలో క్వాలిటీ ప్రమాణాలు లేవని నిర్దారణ అయ్యాయి.

డైఇథిలిన్ గ్లైకాల్ (DEG), ఇథిలీన్ గ్లైకాల్ (EG) పరిమాణం తొమ్మిది బ్యాచ్‌లలో తక్కువగా ఉన్నట్లు, మరికొన్ని సిరప్‌లలో వీటి పరిమాణం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇవి కూడా ప్రాణాంతకమని వెల్లడించారు.

భారతదేశం ఉత్పత్తి చేసిన దగ్గు సిరప్‌లను ప్రపంచవ్యాప్తంగా 141 మంది పిల్లల మరణాలకు కారణమైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తరువాత భారత ప్రభుత్వం రంగంలోకి దిగి.. సిరప్ నాణ్యతలను టెస్ట్ చేయడం మొదలుపెట్టింది.

గాంబియాలో చిన్నారుల మరణాలు
అక్టోబర్ 2022లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కిడ్నీ సమస్యల కారణంగా.. గాంబియాలో సుమారు 70 మంది చిన్నారులు మరణించారని, దీనికి భారతదేశంలో తయారయ్యే దగ్గు, జలుబు సిరప్‌లు కారణమై ఉండొచ్చని వెల్లడించింది. ఆ తరువాత సంబంధిత అధికారులు దగ్గు సిరప్ తయారీ యూనిట్ల తనిఖీలను నిర్వహించి.. ఫార్మా-గ్రేడ్ ప్రొపైలిన్ గ్లైకాల్ వాడకంపై తయారీదారులకు అవగాహన కల్పించారు.

మే 2023లో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ఎగుమతి కోసం ఉద్దేశించిన తయారీదారుల నుంచి దగ్గు సిరప్ నమూనాలను టెస్ట్ చేయడానికి గుర్తింపు పొందిన ల్యాబ్‌లను అనుమతివ్వాలని రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్‌లను ఆదేశించింది. గత జూన్ నుంచి దగ్గు సిరప్ ఎగుమతిదారులు తమ ఉత్పత్తులను ప్రభుత్వ ప్రయోగశాలలలో పరీక్షించి.. సర్టిఫికేట్ అందించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT)ను కోరింది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)