Breaking News

పెట్రోల్ అవసరం లేని వాహనాలు వచ్చేస్తున్నాయి: నితిన్ గడ్కరీ

Published on Tue, 08/06/2024 - 21:10

భారతదేశంలో డీజిల్, పెట్రోల్, ఎలక్ట్రిక్, హైబ్రిడ్, సీఎన్‌జీ కార్లు అందుబాటులో ఉన్నాయి. రాబోయే రోజుల్లో 100 శాతం ఇథనాల్‌తో నడిచే కార్లు, ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేయడానికి ఇండియన్ కంపెనీలు ప్లాంట్‌లను ఏర్పాటు చేస్తున్నాయని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం తెలిపారు.

టయోటా కంపెనీ ఉత్పత్తి చేసిన ఫ్లెక్స్ ఫ్యూయెల్ ఇంజిన్ కలిగిన కారులోనే పార్లమెంటుకు వచ్చిన గడ్కరీ.. మీడియాతో మాట్లాడుతూ.. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్లెక్స్ ఇంజిన్, యూరో 6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉండే మొదటి వాహనం అని ఆయన అన్నారు. ఇది జీరో ఉద్గారాలను ఉత్పత్తి చేస్తుందని ఆయన అన్నారు.

టయోటా కంపెనీ ఇటీవల మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో 20,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఫ్లెక్స్ కార్లను ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. టాటా, మారుతి సుజుకి కంపెనీలు కూడా 100 శాతం ఇథనాల్ లేదా ఫ్లెక్స్ ఇంజన్ కార్లను ఉత్పత్తి చేసే దిశగా అడుగులు వేస్తోందని ఆయన అన్నారు.

టూ వీలర్ విభాగంలో.. బజాజ్, టీవీఎస్, హీరో మోటోకార్ప్ వంటి కంపెనీలు.. ఫ్లెక్స్ ఇంజిన్ బైక్‌లు, స్కూటర్‌లను తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు. పెట్రోల్ పంపుల మాదిరిగానే ఇథనాల్ పంపులు కూడా రానున్నాయి. ఇథనాల్ పరిశ్రమ రైతులకు ఒక వరం అని, ఇథనాల్ డిమాండ్ పెరగడంతోపాటు భారతదేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడం జరుగుతుందని గడ్కరీ అన్నారు.

ఇదీ చదవండి: 'తాత చేసిన పనికి కోటీశ్వరురాలైన మనవరాలు'

ఇది పెట్రోల్ దిగుమతులను భారీగా తగ్గిస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత వృద్ధి చేయడానికి ఇదొక చక్కని మార్గమని గడ్కరీ అన్నారు. 2023 ఆగష్టులో నితిన్ గడ్కరీ టయోటా కిర్లోస్కర్ మోటార్స్ అభివృద్ధి చేసిన 100 శాతం ఇథనాల్ బీఎస్ 6 కంప్లైంట్ ఎలక్ట్రిఫైడ్ ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు నమూనాను ఆవిష్కరించారు. అయితే ఇవి ఎప్పుడు మార్కెట్లోకి వస్తాయనే విషయం మీద ఎటువంటి అధికారిక ప్రకటన అందుబాటులో లేదు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)