Breaking News

ఇండియా ఏఐ ఫెలోషిప్: అర్హతలు ఇవే..

Published on Tue, 09/24/2024 - 20:02

అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ హవా జోరుగా సాగుతున్న వేళ.. చాలామంది ఏఐ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ తరుణంలో ఏఐ ఫెలోషిప్ నామినేషన్స్ ప్రారంభమయ్యాయి. ఇండియా ఏఐ (IndiaAI) ఇండిపెండెంట్ బిజినెస్ డివిజన్ (IBD) బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ స్కాలర్‌ల నుంచి నామినేషన్లను ఆహ్వానిస్తోంది. ఏఐ ఫెలోషిప్ కోసం అప్లై చేసుకోవడానికి ఆసక్తికలిగిన విద్యార్థులు తమ నామినేషన్లను సెప్టెంబర్ 30లోపు సమర్పించాలి.

ఇండియా ఏఐ ఫెలోషిప్ కోసం అప్లై చేయాలనుకునే బీటెక్, ఎంటెక్ విద్యార్థులు రెగ్యులర్‌గా కోర్స్ పూర్తి చేసి ఉండాలి. విద్యార్థులు మొత్తం 80 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఈ ఫెలోషిప్ బీటెక్ విద్యార్థులకు ఒక సంవత్సరం, ఎంటెక్ విద్యార్థులకు రెండు సంవత్సరాలు ప్రాజెక్ట్ వ్యవధిని కవర్ చేస్తుంది.

పీహెచ్‌డీ స్కాలర్స్ తప్పకుండా టాప్ 50 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ పొందిన పరిశోధనా సంస్థల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలలో రీసెర్చ్ చేసి ఉండాలి. అయితే వీరు ఇండియా ఏఐ ఫెలోషిప్ కోసం అప్లై చేసుకునే సమయంలో మరే ఇతర సంస్థ నుంచి స్కాలర్‌షిప్ లేదా జీతం వంటివి పొందకూడదు.

ఇదీ చదవండి: ఉద్యోగాల్లో పెను మార్పులు సంభవిస్తాయి: శామ్‌ ఆల్ట్‌మన్‌

ఇండియా ఏఐ ఫెలోషిప్ కోసం అభ్యర్థుల ఎంపిక అనేది అర్హత, రీసెర్చ్, స్టూడెంట్ ప్రొఫైల్, నేషనల్ లెవెల్ ఫెలోషిప్‌ల లభ్యత ఆధారంగా జరుగుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)