Breaking News

భారత్ - అమెరికా డీల్.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన!

Published on Sat, 02/07/2026 - 15:06

భారత్ - అమెరికా మధ్య జరిగిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం తరువాత.. దేశీయ ఉత్పత్తులపై ఉన్న 50 శాతం సుంకాన్ని 18 శాతానికి తగ్గిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ సందర్భంగా.. ఈ ఒప్పందానికి సంబంధించిన కీలక విషయాలను కేంద్ర వాణిజ్య & పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ వెల్లడిస్తూ.. సుంకాల తగ్గింపులు, జీరో డ్యూటీ వస్తువులు, ఎగుమతులు మొదలైన విషయాలను పేర్కొన్నారు.

సున్నా టారిఫ్
ఈ ఒప్పందంతో అనేక భారత ఉత్పత్తులు అమెరికాకు సున్నా టారిఫ్‌తో ఎగుమతి చేయవచ్చని మంత్రి చెప్పారు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు, రత్నాలు, వజ్రాలు, ఔషధ ఉత్పత్తులు వంటి వాటికి ఇది వర్తిస్తుంది. అలాగే మసాలాలు, టీ, కాఫీ, కొబ్బరి, కొబ్బరి నూనె, జీడిపప్పు, పలు పండ్లు, కూరగాయలు వంటి వ్యవసాయ ఉత్పత్తులపై కూడా అమెరికా సున్నా టారిఫ్ విధించనుంది.

అమెరికాకు ఎగుమతి చేసే అనేక వ్యవసాయ ఉత్పత్తులపై సుంకం ఉండదు. ఇందులో సుగంధ ద్రవ్యాలు, టీ, కాఫీ, కొబ్బరికాయలు, కొబ్బరి నూనె, జీడిపప్పు మాత్రమే కాకుండా అనేక రకాల పండ్లు & కూరగాయలు ఉన్నాయి. ఈ ఒప్పందం వల్ల దేశంలోని రైతులకు ఎలాంటి నష్టం జరగదని మంత్రి స్పష్టంగా చెప్పారు.

ఎగుమతులకు ప్రోత్సాహం
అదేవిధంగా అరటి, స్ట్రాబెర్రీ, చెర్రీ, సిట్రస్ పండ్లకు కూడా ఎలాంటి రాయితీలు ఇవ్వలేదని తెలిపారు. గ్రీన్ టీ, కాబూలీ చన, పెసరపప్పు, నూనెగింజలు, వేరుశెనగలు, మాల్ట్ & మాల్ట్ ఆధారిత ఉత్పత్తులు, మద్యంలేని పానీయాలు, స్టార్చ్, ఎథనాల్, పొగాకు వంటి ఉత్పత్తులకు కూడా ఈ ఒప్పందంలో రాయితీలు లేవని గోయల్ పేర్కొన్నారు. మొత్తం , ఈ వాణిజ్య ఒప్పందం భారత ఎగుమతులను ప్రోత్సహిస్తూ, దేశీయ రైతులు మరియు ఉత్పత్తిదారుల ప్రయోజనాలను కాపాడేలా రూపొందించబడిందని ఆయన స్పష్టం చేశారు.

భారత్‌లోకి జన్యుమార్పిడి (జీఎం) ఉత్పత్తులను దిగుమతి చేయబోమని గోయల్ స్పష్టం చేశారు. అంతే కాకుండా మన దేశంలో పండే అరటి, స్ట్రాబెర్రీ, చెర్రీ, సిట్రస్ పండ్లకు ఎలాంటి రాయితీలు ఇవ్వలేదని, వీటి దిగుమతులు అనుమతించబోమని చెప్పారు. గ్రీన్ టీ, కాబూలీ చనా, పెసలు, నూనె గింజలు, వేరుశెనగ, మాల్ట్, మాల్ట్ ఆధారిత ఉత్పత్తులు, మద్యంలేని పానీయాలు, స్టార్చ్, ఎథనాల్, పొగాకు వంటి వాటికీ ఎలాంటి టారిఫ్ సడలింపులు లేవని తెలిపారు.

వీటిపై 18 శాతం సుంకం
భారత్ ఎగుమతి చేసే వస్త్రాలు, దుస్తులు తోలు, పాదరక్షలు, ప్లాస్టిక్ & రబ్బరు ఉత్పత్తులు, సేంద్రీయ రసాయనాలు, గృహాలంకరణ, చేతివృత్తుల ఉత్పత్తులు & కొన్ని యంత్రాలపై అమెరికా 18 శాతం సుంకం విధించింది.

సుంకాల తగ్గింపుతో.. భారత ఎగుమతిదారులకు అమెరికా మార్కెట్లో స్వల్ప ప్రయోజనం చేకూరనుంది. పొరుగు దేశాలైన చైనా (35 శాతం), బంగ్లాదేశ్ (20 శాతం), ఇండోనేషియా (19 శాతం) కూడా భారత్ (18 శాతం) కంటే ఎక్కువ సుంకాలను ఎదుర్కొంటున్నాయి. 

ఇదీ చదవండి: మీ దగ్గరున్న వెండి స్వచ్ఛమైనదా, కాదా?: తెలుసుకోండిలా..

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)