Breaking News

వాణిజ్య ఒప్పందంతో కొత్త అవకాశాలు 

Published on Sat, 04/26/2025 - 05:56

న్యూఢిల్లీ: భారత్‌,  వాణిజ్య ఒప్పందం,  అమెరికా ఉత్పత్తులకు,  కొత్త అవకాశాల,ను తీసుకొస్తుందని అమెరికా వాణిజ్య ప్రతినిధి (యూఎస్‌టీఆర్‌) జైమీసన్‌ గ్రీర్‌ తెలిపారు. అంతేకాదు ఇరు దేశాల్లోని కారి్మకులు, రైతులు, వ్యాపారవేత్తలకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు. భారత్‌–అమెరికా కాంపాక్ట్‌ భాగస్వామ్యం ప్రాధాన్యతను ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన మరోసారి ధ్రువీకరించినట్టు చెప్పారు. 

రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం దిశగా పురోగతిని ప్రస్తావించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ద్వైపాక్షిక చర్చలు వాణిజ్యం విషయంలో సమతుల్యతను తీసుకొస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. యూఎస్‌టీర్, భారత వాణిజ్య శాఖ, పరిశ్రమల శాఖలు చర్చలకు సంబంధించి నిబంధనలను ఇప్పటికే ఖరారు చేసినట్టు చెప్పారు.

 భారత మార్కెట్‌లో తన ఉత్పత్తులకు మరింత ప్రవేశం కల్పించడం కోసం అమెరికా చూస్తోందని, టారిఫ్, నాన్‌ టారిఫ్‌ అడ్డంకులను తగ్గించుకోవాలని అనుకుంటున్నట్టు తెలిపారు. దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా అదనపు హామీలపై చర్చించనున్నట్టు చెప్పారు. భారత్‌ పెద్ద ఎత్తున టారిఫ్‌లు విధిస్తోందంటూ అమెరికా ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో ఆరోపించడం గమనార్హం. భారత్‌తో 45.7 బిలియన్‌ డాలర్ల వాణిజ్యలోటును అమెరికా మోస్తోంది.

 2024లో భారత్‌తో అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం 129.2 బిలియన్‌ డాలర్లుగా ఉంది. భారత ఉత్పత్తులపై అమెరికా సగటు టారిఫ్‌ 3.3 శాతంగా ఉంటే, అమెరికా ఉత్పత్తులపై భారత్‌ సగటున 17 శాతం టారిఫ్‌ విధిస్తుండడం గమనార్హం. టారిఫ్‌లకు అదనంగా సేవల మార్కెట్‌కు సంబంధించి సాంకేతిక పరమైన అవరోధాలు, నియంత్రణపరమైన అవరోధాలు భారత్‌తో అమెరికా వాణిజ్యం పెంచుకునే విషయంలో అవరోధాలు కలి్పస్తున్నట్టు జైమీసన్‌ గ్రీర్‌ తెలిపారు.   

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)