Breaking News

భారత్, యూఏఈ మధ్య బంగారం వాణిజ్యం పెంపు

Published on Tue, 06/13/2023 - 06:18

న్యూఢిల్లీ: విలువ ఆధారిత బంగారం ఉత్పత్తుల్లో వాణిజ్యం పెంచుకునే విషయమై భారత్, యూఏఈ దృష్టి సారించినట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. ఇందుకు సంబంధించిన నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. స్విట్జర్లాండ్‌ తర్వాత భారత్‌కు ఎక్కువ బంగారం సరఫరా చేసే దేశం యూఏఈ అని చెప్పారు. యూఈఏతో బంగారం వాణిజ్యాన్ని మరింత పెంచుకోవాలని అనుకుంటున్నట్టు తెలిపారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కింద యూఏఈ నుంచి బంగారం దిగుమతులపై కేంద్రం పలు రాయితీలు కల్పించిన విషయాన్ని ప్రస్తావించారు.

అయితే, ఈ రాయితీలకు సంబంధించి పరిష్కరించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయంటూ, త్వరలోనే అవి పరిష్కామవుతాయన్నారు. సోమవారం ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఈ మేరకు మంత్రి మాట్లాడారు. ఈయూఏతో భారత్‌కు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం 2022 మే 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఏడాదిలో 200 టన్నుల వరకు బంగారం దిగుమతులపై సుంకాల్లో రాయితీలు ఇచ్చేందుకు భారత్‌ అంగీకరించింది. సాధారణంగా అయితే బంగారం దిగుమతులపై సుంకం 15 శాతంగా ఉంది.

ఈ పరిమితి మేరకు బంగారాన్ని ఎగుమతి చేయడం ద్వారా యూఏఈ ప్రయోజనం పొందొచ్చని కేంద్రం భావిస్తోంది. భారత జెమ్స్, జ్యుయలరీకి యూఏఈ అతిపెద్ద మార్కెట్‌గా ఉండడం గమనార్హం. ఈ రంగంలో భారత్‌ నుంచి జరిగే ఎగుమతుల్లో 15 శాతం యూఏఈకే వెళుతుంటాయి. 2022–23లో భారత్‌ నుంచి జెమ్స్‌ జ్యుయలరీ మొత్తం ఎగుమతులు 37.5 బిలియన్‌ డాలర్ల మేర ఉన్నాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 5 శాతం తగ్గాయి.   
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)