Breaking News

వాణిజ్య లోటు ఊరట

Published on Tue, 03/17/2026 - 03:51

న్యూఢిల్లీ: దేశం నుంచి గత నెలలో వివిధ వస్తువుల (మెర్కండైజ్‌) ఎగుమతులు వార్షికంగా 0.8 శాతం క్షీణించి 36.61 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అంతేకాకుండా ఫిబ్రవరిలో వాణిజ్య లోటు 27.1 బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. అయితే పశ్చిమాసియా యుద్ధం ఫిబ్రవరి 28న ప్రారంభం కావడంతో ఈ ప్రభావం మార్చి నెల వాణిజ్య గణాంకాలపై కనిపించనుంది.

మార్చి గణాంకాలు మే నెల మధ్యలో విడుదలవుతాయి. కాగా.. రవాణాపై రాజకీయ, భౌగోళిక సవాళ్లు ప్రభావం చూపడంతో మార్చిలో ఎగుమతులు క్షీణించనున్నట్లు వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. కాగా.. ఫిబ్రవరిలో దిగుమతులు 24 శాతంపైగా ఎగసి 63.71 బిలియన్‌ డాలర్లను తాకాయి. ఇందుకు పసిడి, వెండి దిగుమతులు కారణమయ్యాయి.

గోల్డ్‌ షిప్‌మెంట్స్‌ 219 శాతం జంప్‌చేసి 7.44 బిలియన్‌ డాలర్లకు చేరగా.. సిల్వర్‌ దిగుమతులు 285 శాతంపైగా ఎగసి 1.66 బిలియన్‌ డాలర్లయ్యాయి. మరోపక్క ముడిచమురు దిగుమతులు 9 శాతం అధికమై 12.97 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే జనవరిలో నమోదైన 34.68 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే గత నెలలో వాణిజ్య లోటు తగ్గింది. వార్షికంగా అంటే 2025 ఫిబ్రవరిలో నమోదైన 14.05 బిలియన్‌ డాలర్లతో చూస్తే భారీగా పెరిగింది.  

11 నెలల్లో..: ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌– ఫిబ్రవరి కాలంలో దేశ ఎగుమతులు దాదాపు 2 శాతం పుంజుకుని 402.93 బిలియన్‌ డాలర్లను తాకాయి. ఇదే కాలంలో దిగుమతులు 8.5 శాతం పెరిగి 713.53 బిలియన్‌ డాలర్లకు చేరాయి. దీంతో ఈ ఏడాది(2025–26) తొలి 11 నెలల్లో వాణిజ్య లోటు 310.6 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. గతేడాది(2024–25) ఇదే కాలంలో ఈ లోటు 261.8 బిలియన్‌ డాలర్లు మాత్రమే.

అమెరికాకు ఎగుమతులు డౌన్‌
అధిక టారిఫ్‌ల భారం కారణంగా అమెరికాకు భారత్‌ నుంచి ఎగుమతులు ఫిబ్రవరిలో 6.88 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. కేంద్ర వాణిజ్య శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 12.88 శాతం తగ్గాయి. భారత్‌పై అమెరికా 50% పైగా సుంకాలు విధించడం, తర్వాత అక్కడి సుప్రీంకోర్టు వాటిని కొట్టివేయడంతో తిరిగి 150 రోజుల వ్యవధికి 10% విధించడం   తెలిసిందే. సుంకాల తగ్గుదల ప్రభావం మార్చి ఎగుమతుల గణాంకాల్లో తెలియనుంది.    

11 నెలల వ్యవధిలో..: ఇక ఈ ఆర్థిక సంవత్సరం 11 నెలల వ్యవధిలో అమెరికాకు ఎగుమతులు 3.84% పెరిగి 79.29 బి.డాలర్లకు, దిగుమతులు 15.65% పెరిగి 48.4 బి.డాలర్లకు చేరాయి. మరోవైపు, చైనాకు ఎగుమతులు 37.66% పెరిగి 17.54 బి. డాలర్లకు, దిగుమతులు 119.55 బి. డాలర్లకు ఎగిశాయి.

Videos

ప్రజా దర్బార్ లో పేదలను అవమానించిన బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ

103 డాలర్లకు చమురు ధర

దొంగచాటుగా హర్ముజ్ జలసంధిని దాటుతున్న నౌకలు

కూటమి తీరుపై రాష్ట్రవ్యాప్తంగా వైస్సార్సీపీ భారీ నిరసన

సీపీ సతీమణి ఏకే 47 గన్ తో 10 రౌండ్ల కాల్పులు

శత్రుల రాడార్లను ముప్పు తిప్పలు పెట్టె ఇరాన్ మిస్సైల్

Sec-Bad: 800 కిలోల కుళ్లిన చికెన్

ఎమ్మెల్యేల కథ దేవుడెరుగు.. BR నాయుడు రాసలీలలపై జగన్ సెటైర్లు

ఇది కదా తండ్రి ప్రేమంటే కొడుకు పరీక్ష కోసం ఏం చేశాడంటే

లాగి చెంపకేసి ఒక్కటి పీకాల్సింది పోయి... ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసుపై జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

ప్రతి ఇంట్లో ఇప్పుడు అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

తమ్ముడి పిల్లల బర్త్‌డే వేడుకల్లో మహేశ్‌ బాబు (ఫోటోలు)

+5

ఆస్కార్‌ వేడుకలో మెరిసిన వారణాసి బ్యూటీ ప్రియాంక చోప్రా.. (ఫోటోలు)

+5

రష్మిక-విజయ్ దేవరకొండ హల్దీ వేడుక.. (ఫొటోలు)

+5

‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

ఘనంగా నమన్‌ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)

+5

OSCARS 2026 : ఆస్కార్‌ విజేతల జాబితా (ఫోటోలు)

+5

ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 15- 22)

+5

కుల్దీప్‌ యాదవ్‌ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)