Breaking News

వెండి దిగుమతులపై ఆంక్షలు

Published on Wed, 06/03/2026 - 08:11

కేంద్ర ప్రభుత్వం తాజాగా వెండి దిగుమతులపై ఆంక్షలు విధించింది. నిర్దిష్ట సంస్థలు ఇకపై ఏ రూపంలోనైనా వెండిని దిగుమతి చేసుకోవాలంటే తప్పనిసరిగా విదేశీ వాణిజ్య డైరెక్టరేట్‌ జనరల్‌(డీజీఎఫ్‌టీ) నుంచి అధీకృత అనుమతులను పొందవలసి ఉంటుంది. బ్యాంకులుసహా ఆర్‌బీఐ నియమిత ఏజెన్సీలు, డీజీఎఫ్‌టీ అనుమతించిన సంస్థలతోపాటు.. ఇండియా ఇంటర్నేషనల్‌ బులియన్‌ ఎక్స్ఛేంజ్‌ ద్వారా అర్హతగల ఐఎఫ్‌ఎస్‌సీఏ నిర్ధారిత ఆభరణ విక్రేతలు.. వెండిని దిగుమతి చేసుకోవాలంటే డీజీఎఫ్‌టీ అధీకృత అనుమతులు తప్పనిసరి.

వెరసి ఇప్పటికే పసిడి, వెండి దిగుమతులపై దిగుమతి సుంకాన్ని గత నెలలో 15 శాతానికి పెంచిన కేంద్ర ప్రభుత్వం తాజాగా వెండి దిగుమతులపై కఠిన నిబంధనలకు తెరతీసినట్లయింది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో విదేశీ మారక నిల్వలపై ప్రతికూల ప్రభావం పడుతున్న కారణంగా ప్రభుత్వం తాజా చర్యలను చేపట్టింది. వార్షికంగా ఏప్రిల్‌ నెలలో వెండి దిగుమతులు 157 శాతం జంప్‌చేసి 41.1 కోట్ల డాలర్లను తాకగా.. గతేడాది(2025–26)లో సైతం 150 శాతం ఎగసి 1,200 కోట్ల డాలర్లకు చేరాయి. భారత్‌ ప్రధానంగా యూఏఈ, యూకే, చైనా నుంచి వెండిని దిగుమతి చేసుకుంటోంది. అటు ఆభరణాల తయారీ, ఇటు పారిశ్రామిక వినియోగానికి వెండిని వినియోగించే విషయం విదితమే.

ఇదీ చదవండి: కంపెనీకి లాభాలొస్తే ఉద్యోగుల జీతం పెంచరు కదా!

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)