Breaking News

నెల రోజుల్లో 43 లక్షల కొత్త కనెక్షన్లు

Published on Sat, 06/28/2025 - 14:27

దేశీయంగా మే నెలలో టెలికం యూజర్ల సంఖ్య స్వల్పంగా 43,58,231 మేర పెరిగి 120.7 కోట్లకు చేరింది. కొత్త యూజర్లలో సింహభాగం 99.84 శాతం వాటాను (43,51,294 కనెక్షన్లు) రిలయన్స్‌ జియో, భారతి ఎయిర్‌టెల్‌ దక్కించుకున్నాయి. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 5జీ ఫిక్సిడ్‌ వైర్‌లెస్‌ యాక్సెస్‌ విభాగంలో రిలయన్స్‌ జియో యూజర్ల సంఖ్య నికరంగా 27 లక్షల కొత్త కస్టమర్లతో 47.24 కోట్లకు చేరింది. 40.92 శాతం మార్కెట్‌ వాటా ఉంది.

ఇదీ చదవండి: ఐటీ అధికారులకు సీబీడీటీ సూచన

భారతీ ఎయిర్‌టెల్‌ సబ్ర్‌స్కయిబర్స్‌ సంఖ్య నికరంగా 2.75 లక్షలు పెరిగి 39 కోట్లకు చేరగా, 33.61 శాతం మార్కెట్‌ వాటాను దక్కించుకుంది. అయితే సంక్షోభంలో ఉన్న వొడాఫోన్‌ ఐడియా 2.74 లక్షల మంది, ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ 1.35 లక్షలు, ఎంటీఎన్‌ఎల్‌ 4.7 లక్షల మంది కస్టమర్లను కోల్పోయాయి. వైర్‌లైన్‌ సెగ్మెంట్‌లో జియో కొత్త యూజర్ల సంఖ్య 12.76 లక్షలు, ఎయిర్‌టెల్‌ యూజర్లు 99,000, టాటా టెలీసర్వీసెస్‌ సబ్‌స్క్రైబర్స్‌ 4,890, వొడాఫోన్‌ ఐడియా యూజర్ల సంఖ్య 1,795 పెరిగింది. ప్రభుత్వ రంగ ఎంటీఎన్‌ఎల్‌ అత్యధికంగా 66,834 మంది, బీఎస్‌ఎన్‌ఎల్‌ 46,000 మంది కస్టమర్లను కోల్పోయాయి. దేశీయంగా మొత్తం ల్యాండ్‌లైన్‌ కనెక్షన్లు 3.34 శాతం పెరిగి 3.86 కోట్లకు, మొబైల్‌ కనెక్షన్లు 116.84 కోట్లకు చేరాయి. ఏప్రిల్‌లో మొత్తం యూజర్ల సంఖ్య 120.3 కోట్లు.

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)