Breaking News

సవాళ్లున్నా సాఫ్ట్‌వేర్‌దే హవా

Published on Wed, 02/25/2026 - 02:50

ముంబై: భౌగోళిక–రాజకీయ అంశాల కారణంగా ఒడిదుడుకులు నెలకొని, కృత్రిమ మేథతో (ఏఐ) పరిస్థితుల్లో పెను మార్పులు వచ్చినప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) దేశీ టెక్నాలజీ రంగం ఆదాయం 315 బిలియన్‌ డాలర్లకు చేరనుంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 6.1 శాతం వృద్ధి చెందనుంది. దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్‌ వార్షిక నివేదికలో ఈ విషయాలు తెలిపింది. 2026 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమలో కొత్తగా 1.35 లక్షల ఉద్యోగాలు జత కావడం ద్వారా ప్రత్యక్ష ఉద్యోగుల సంఖ్య 58.15 లక్షల నుంచి పెరిగి 59.5 లక్షలకు చేరుతుందని పేర్కొంది.

 గత ఆర్థిక సంవత్సరంలో 1.33 లక్షల కొత్త కొలువులు జత కాగా, ఈసారి 2,000 మాత్రమే పెరగడమనేది ఇటీవలి కాలంలో అత్యంత తక్కువ స్థాయి వృద్ధిగా నమోదు కానుంది. ఆదాయం వృద్ధి చెందినంత స్థాయిలో కొలువులు పెరగకపోయినప్పటికీ, నికరంగా ఉద్యోగాలు పెరుగుతుండటమనేది సానుకూలాంశమని నాస్కామ్‌ ప్రెసిడెంట్‌ రాజేశ్‌ నంబియార్‌ తెలిపారు. టెక్నాలజీలో పరిస్థితులు మారే కొద్దీ రాబోయే రోజుల్లోనూ ఉద్యోగాలు పెరుగుతాయని అంచనా వేస్తుననట్లు వివరించారు. 59.5 లక్షల మంది ఉద్యోగుల్లో 20 లక్షల మంది ఏఐ శిక్షణ పొందగా, వీరిలో 3 లక్షల మంది అడ్వాన్స్‌డ్‌ ఏఐ నైపుణ్యాలను నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. పరిశ్రమకు సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, వాస్తవంగా చూస్తే కొత్త విభాగాల్లో టెక్నాలజీపై ఖర్చు చేయడం పెరుగుతుండటం సానుకూలమైన విషయమన్నారు.  

నివేదిక ప్రకారం.. 
ప్రధాన ఐటీ సరీ్వసుల ఆదాయం 143 బిలియన్‌ డాలర్ల నుంచి 149 బిలియన్‌ డాలర్లకు, బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌ రెవెన్యూ 55 బిలియన్‌ డాలర్ల నుంచి 59 బిలియన్‌ డాలర్లకు, సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తుల ఆదాయం 21 బిలియన్‌ డాలర్ల నుంచి 23 బిలియన్‌ డాలర్లకు పెరగనుంది. 
ఇంజినీరింగ్, రీసెర్చ్, డెవలప్‌మెంట్‌ ఆదాయాలు 59 బిలియన్‌ డాలర్ల నుంచి 63 బిలియన్‌ డాలర్లకు, హార్డ్‌వేర్‌ కంపెనీల ఆదాయాలు 19 బిలియన్‌ డాలర్ల నుంచి 21 బిలియన్‌ డాలర్లకు పెరగనున్నాయి. 

గతంలో అమెరికా, ఉత్తర అమెరికా మార్కెట్లలో ఆదాయ వృద్ధి అత్యధికంగా ఉండగా, ప్రస్తుతం ఆసియా–పసిఫిక్, మధ్యప్రాచ్య ప్రాంతాల్లో వేగవంతమైన వృద్ధి నమోదవుతోంది. ప్రపంచ సగటుతో పోలిస్తే దేశీ మార్కెట్లో ఆదాయాలు అత్యధికంగా 7.9 శాతం మేర వృద్ధి చెందనుండటం ఆసక్తికరమైన అంశం. 
విభాగాలవారీగా చూస్తే ఆరోగ్య సంరక్షణ, ట్రావెల్, రవాణా సెగ్మెంట్ల ఆదాయాలు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నాయి.  

చాలా మటుకు కంపెనీలు ఏఐ ఆదాయాలను వెల్లడించవు, కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం కృత్రిమ మేథపరమైన ఆదాయాలు 10–12 బిలియన్‌ డాలర్లుగా ఉంటాయని అంచనా.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)