Breaking News

టీసీఎస్, టీపీజీ నుంచి డేటా సెంటర్‌

Published on Fri, 11/21/2025 - 04:21

ముంబై: ఐటీ సరీ్వసుల దేశీ దిగ్గజం టీసీఎస్, పీఈ దిగ్గజం టీపీజీ డేటా సెంటర్ల బిజినెస్‌లోకి ప్రవేశిస్తున్నాయి. రెండు సంస్థల భాగస్వామ్యంలో ఇందుకు రూ. 18,000 కోట్ల పెట్టుబడులు వెచ్చించే యోచనలో ఉన్నట్లు వెల్లడించాయి. హైపర్‌వాల్ట్‌ పేరుతో ఏఐ డేటా సెంటర్‌ ఏర్పాటుకు టీపీజీ బిలియన్‌ డాలర్లు(రూ. 8,870 కోట్లు) వెచ్చించనుంది. తద్వారా భాగస్వామ్య వెంచర్‌లో 27.5–49 శాతం మధ్య వాటాను పొందనుంది. 

టీపీజీని వ్యూహాత్మక పెట్టుబడుల భాగస్వామిగా చేసుకోవడం ద్వారా వాటాదారులకు పటిష్ట రిటర్నులందించేందుకు వీలుంటుందని టీసీఎస్‌ పేర్కొంది. అంతేకాకుండా పెట్టుబడి అవసరాలు తగ్గడంతోపాటు.. డేటా సెంటర్‌ ప్లాట్‌ఫామ్‌కు దీర్ఘకాలిక విలువ చేకూరుతుందని తెలియజేసింది. డేటా సెంటర్లలోకి భారీస్థాయిలో ప్రవేశించనున్నట్లు గత నెలలో టీసీఎస్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.  

6.5 బిలియన్‌ డాలర్లు 
దేశీయంగా 1 గిగావాట్‌ సామర్థ్య ఏర్పాటుకు 6.5 బిలియన్‌ డాలర్లు(రూ. 57,650 కోట్లు) వెచి్చంచనున్నట్లు టీసీఎస్‌ తెలిపింది. వేగంగా పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా దేశంలో డేటా సెంటర్లను నెలకొల్పేందుకు టీపీజీ భాగస్వామికావడం సంతోషకరమని టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు. దీంతో హైపర్‌స్కేలర్స్, ఏఐ కంపెనీలతో తమ భాగస్వామ్యం మరింత పటిష్టంకానున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దేశీయంగా డేటా సెంటర్ల సామర్థ్యం 1.5 గిగావాట్‌M >గా.. 2030కల్లా 10 గిగావాట్లకు బలపడనున్నట్లు అంచనా. ఇప్పటివరకూ డేటా సెంటర్ల బిజినెస్‌ 94 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ఆకట్టుకోవడం గమనార్హం! 
టీసీఎస్‌ షేరు యథాతథంగా రూ. 3,146 వద్ద ముగిసింది. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)