పదేళ్లలో 10 లక్షల స్టార్టప్‌లు

Published on Thu, 03/13/2025 - 12:30

దేశంలో రానున్న పదేళ్లలో 10 లక్షల స్టార్టప్‌లు పుట్టుకొస్తాయని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని అంచనా వేశారు. భారతదేశ వ్యవస్థాపక భవిష్యత్తు(entrepreneurial future) ప్రతిష్టాత్మకంగా ఉంటుందని చెప్పారు. ‘ఆర్కామ్ వెంచర్స్ వార్షిక సమావేశం 2025’లో నీలేకని మాట్లాడారు. రానున్న రోజుల్లో స్టార్టప్‌లు సాంకేతికత, మూలధనం, ఆంత్రపెన్యూర్‌షిప్‌, ఫార్మలైజేషన్ వంటి అంశాలతో వేగంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు.

ప్రస్తుతం భారత్‌లో 1,50,000 స్టార్టప్‌లు ఉన్నాయని, ఈ రంగంలో 20 శాతం వార్షిక వృద్ధి రేటు ఉంటుందని నీలేకని అంచనా వేశారు. ప్రస్తుతం ఉన్న స్టార్టప్‌లు భవిష్యత్తులో మరిన్ని స్టార్టప్‌ల సృష్టికి ఊతమిచ్చేలా ‘బైనరీ విచ్ఛిత్తి(ఒకటి రెండుగా మారడం)’ని పోలి ఉంటాయని చెప్పారు. అందుకు ఉదాహరణగా ఫ్లిప్‌కార్ట్‌ను చెప్పుకొచ్చారు. ఫ్లిప్‌కార్ట్‌ వంటి విజయవంతమైన కంపెనీల నుంచి ఉద్యోగులు తమ సొంత సంస్థలను స్థాపించినట్లు గుర్తు చేశారు.

భాషలు, మాండలికాలకు ఏఐ నమూనాలు

ఈ వృద్ధికి దోహదపడటంలో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పాత్ర కీలకంగా మారిందని నీలేకని నొక్కి చెప్పారు. ఆధార్, యూసీఐ వంటి కార్యక్రమాలు ఇప్పటికే బలమైన డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు పునాది వేశాయని తెలిపారు. భారతీయ భాషలు, ప్రాంతీయ మాండలికాలకు అనుగుణంగా ఓపెన్ సోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నమూనాల అవసరాన్ని ఉద్ఘాటించారు. ఇవి సాంకేతిక పరిజ్ఞానం విభాగంలో మరిన్ని అవకాశాలు సృష్టిస్తాయని అంచనా వేశారు.

ఇదీ చదవండి: ఫ్లిప్‌కార్ట్‌ ​కోఫౌండర్‌ కొత్త కంపెనీ ప్రారంభం

అత్యంత ఆదరణ కలిగే ఐపీఓ మార్కెట్‌గా భారత్‌

2035 నాటికి భారత్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగే ఐపీఓ మార్కెట్‌గా అవతరిస్తుందని, రెండో అతిపెద్ద ఐపీవో మార్కెట్‌గా భారత్‌ ప్రస్తుత స్థానాన్ని అధిగమిస్తుందని నీలేకని తెలిపారు. ఈ మార్పు భవిష్యత్తులో గణనీయమైన పెట్టుబడులను ఆకర్షిస్తుందని పేర్కొన్నారు. ఇది ఉద్యోగాల సృష్టిని వేగవంతం చేస్తుందని, సమీప భవిష్యత్తులో ఎనిమిది ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలనే దేశం లక్ష్యానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు.

#

Tags : 1

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)