Breaking News

అమెరికాతో భారత్‌ ఎల్‌పీజీ డీల్‌

Published on Tue, 11/18/2025 - 04:23

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజాలు ఏడాదిపాటు యూఎస్‌ నుంచి వంట గ్యాస్‌(ఎల్‌పీజీ) కొనుగోలుకి ఒప్పందం కుదుర్చుకున్నాయి. డీల్‌లో భాగంగా 2026వరకూ 2.2 మిలియన్‌ టన్నుల ఎల్‌పీజీని దిగుమతి చేసుకోనున్నాయి. దీంతో యూఎస్‌ నుంచి భారత ప్రభుత్వం ఇంధన కొనుగోళ్లను పెంచుకోనుంది. తద్వారా యూఎస్‌తో వాణిజ్య మిగులును తగ్గించుకోనుంది. 

దేశీ వస్తువులపై యూఎస్‌ ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ 50% టారిఫ్‌లను విధించిన నేపథ్యంలో తాజా డీల్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. దేశీ పీఎస్‌యూ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌.. యూఎస్‌ గల్ఫ్‌ కోస్ట్‌ నుంచి ఎల్‌పీజీ దిగుమతికి ఏడాదిపాటు అమల్లో ఉండే కాంట్రాక్టుకు తెరతీసినట్లు అధికారిక ప్రకటన తెలిపింది. భారత వార్షిక ఎల్‌పీజీ దిగు మతుల్లో ఇది 10% కాగా, దేశీ మార్కెట్లకు యూఎస్‌ ఎల్‌పీజీ సరఫరాపై తొలి కాంట్రాక్టుగా నిలవనుంది. 

31 మిలియన్‌ టన్నులు 
పెట్రోల్, డీజిల్, జెట్‌ ఇంధనం విషయంలో భారత్‌ స్వయం సమృద్ధిని సాధించినప్పటికీ.. దేశీయంగా వినియోగించే 31 మిలియన్‌ టన్నుల ఎల్‌పీజీలో 65 శాతంవరకూ దిగుమతి చేసుకుంటోంది. 2024లో దిగుమతి చేసుకున్న 20.4 మిలియన్‌ టన్నులలో 90 శాతంవరకూ యూఏఈ, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా నుంచి లభించింది.   గత రెండు నెలలుగా యూఎస్‌తో భారత్‌ నిర్వహిస్తున్న ద్వైపాక్షిక వాణిజ్య చర్చలలో భాగంగా వంట గ్యాస్‌ దిగుమతులకు తెరతీసింది. మరోపక్క పెట్రోల్, డీజిల్‌ తదితరాలను ప్రాసెస్‌ చేసేందుకు వీలయ్యే ముడిచమురులో 8 శాతంవరకూ యూఎస్‌ నుంచి కొనుగోలు చేస్తోంది.  

51 శాతం అధికం 
ఈ ఏడాది(2025) తొలి అర్ధభాగంలో యూఎస్‌ నుంచి రోజుకి 2,71,000 బ్యారళ్ల(బీపీడీ) ముడిచమురు ను భారత్‌ దిగుమతి చేసుకుంది. 2024 తొలి ఆరు నెలల దిగుమతులతో పోలిస్తే ఇవి 51 శాతం అధికం.   

చారిత్రాత్మకం 
ప్రపంచంలోనే వేగవంత వృద్ధిలో ఉన్న, భారీ ఎల్‌పీజీ మార్కెట్‌ అయిన భారత్‌ తొలిసారి యూఎస్‌తో డీల్‌ కుదుర్చుకున్నట్లు చమురు శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఇది చారిత్రాత్మకంకాగా.. తద్వారా దేశ ప్రజలకు అందుబాటు ధరలో ఎల్‌పీజీ సరఫరాలకు తెరతీసినట్లు చెప్పారు.

Videos

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

అర్హులకు అన్యాయం.. నకిలీలకు ఉద్యోగాలా?

ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు