Breaking News

జపాన్‌ను వెనక్కి నెడుతున్నామని సంతృప్తి చెందొద్దు

Published on Tue, 06/10/2025 - 11:15

భారత్‌ జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తున్నందుకు సంతృప్తి చెందొద్దని.. తలసరి ఆదాయం పరంగా జపాన్‌తో పోల్చి చూస్తే భారత్‌ ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉన్నట్టు ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) మాజీ ఎండీ క్లౌడే స్మద్జా వ్యాఖ్యానించారు.

ఐఎంఎఫ్‌ 2025 ఏప్రిల్‌ డేటా ప్రకారం భారత్‌లో తలసరి ఆదాయం 2,878 డాలర్లు. జపాన్‌ తలసరి ఆదాయం 33,956 డాలర్లలో పోల్చి చూస్తే కేవలం 8.5 శాతమే కావడం గమనార్హం. భారత్‌ తలసరి ఆదాయం కంటే జపాన్‌లో తలసరి ఆదాయం 11.8 రెట్లు అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. ‘భారత్‌ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో నాలుగో స్థానానికి చేరుకోవడం సాధించిన ప్రగతికి సంబంధించి మంచి సంకేతమే. కానీ, ఈ విషయంలో సంతృప్తి చెందడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదు’ అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: భారతీయ కళలు ఉట్టిపడేలా నీతా అంబానీ ఆధ్వర్యంలో వేడుకలు

ఆర్థికంగా భారత్‌ కొత్త స్థానానికి చేరుకోవడం అన్నది.. సంస్కరణలను వేగవంతం చేయడానికి.. అభివృద్ధి ఫలాలు కేవలం పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని మధ్యతరగతి వర్గాలకే పరిమితం కాకుండా పౌరులు అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు అందించేందుకు ప్రేరణ కావాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా సాంకేతిక పోటీలో భారత్‌ కీలకమైన కూడలిలో ఉన్నట్టు తెలియజేస్తూ.. బిగ్‌ డేటా పరంగా ఆధిక్యత ప్రదర్శిస్తున్నట్టు స్మద్జా తెలిపారు. ఈ స్థానాన్ని తప్పకుండా కాపాడుకోవడంతోపాటు.. అంతర్జాతీయంగా టెక్నాలజీ, ఆవిష్కరణల్లో అగ్రస్థానానికి చేరుకోవడానికి దీన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)