Breaking News

మన వాహన రంగం  ప్రపంచంలోనే టాప్‌!

Published on Thu, 09/11/2025 - 02:35

న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్లలో భారత ఆటోమొబైల్‌ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్‌ వన్‌గా నిలబెట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. తాను రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు రూ. 14 లక్షల కోట్లుగా ఉన్న దేశీ ఆటోమొబైల్‌ పరిశ్రమ ఇప్పుడు రూ. 22 లక్షల కోట్లకు చేరిందని వివరించారు. 

ప్రస్తుతం అమెరికా పరిశ్రమ రూ. 78 లక్షల కోట్ల విలువతో అగ్రస్థానంలో ఉండగా, రూ. 47 లక్షల కోట్లతో చైనా రెండో స్థానంలో ఉంది. ‘భారత వాహన పరిశ్రమను ఐదేళ్లలో ప్రపంచంలోనే నంబర్‌ వన్‌గా నిలబెట్టాలనేది మా లక్ష్యం. ఇది కాస్త కష్టమే, అయినప్పటికీ, అసాధ్యం మాత్రం కాదు’ అని గడ్కరీ చెప్పారు. భారత్‌లో అత్యంత నాణ్యమైన వాహనాలు చౌకగా తయారవుతున్నందున, టాప్‌ ఆటోమొబైల్‌ కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నాయని వివరించారు.  

ఈ–20కి వ్యతిరేకంగా పెట్రోల్‌ లాబీలు .. 
ఈ–20 ఇంధనంపై (20 శాతం ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌) ఆందోళనలు వ్యక్తమవుతుండటంపై స్పందిస్తూ.. పెట్రోలియం రంగం దీనికి వ్యతిరేకంగా లాబీయింగ్‌ చేస్తోందని గడ్కరీ చెప్పారు. ‘ప్రతీచోట లాబీలు ఉంటాయి. ఎవరి ప్రయోజనాలు వారివి. పెట్రోల్‌ లాబీ చాలా సంపన్నమైనది’ అని ఆయన వ్యాఖ్యానించారు. వ్యవసాయం రంగంలో ఉపయోగించే వాహనాల్లో ఫ్లెక్స్‌–ఫ్యూయల్‌ ఇంజిన్ల వాడకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.  

వేగంగా ఎదుగుతున్న ఈవీ మార్కెట్‌: కుమారస్వామి 
ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) మార్కెట్లలో ఇప్పుడు భారత్‌ కూడా ఒకటని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి తెలిపారు. 2024–25లో దేశీయంగా 10 లక్షల ఈవీలు అమ్ముడయ్యాయని ఆయన వివరించారు. వీటిలో ఈ–టూవీలర్ల వాటా 1 శాతంగా, త్రీ–వీలర్ల వాటా 57 శాతంగా ఉందని  చెప్పారు. ఆటో రిటైల్‌ సదస్సుకు పంపిన వీడియో సందేశంలో మంత్రి ఈ విషయాలు తెలిపారు.  

ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ పెంచాలి.. 
శిలాజ ఇంధనాల దిగుమతి కోసం భారత్‌ రూ. 22 లక్షల కోట్లు వెచి్చస్తోందని, ఇటువంటి ఇంధనాల వల్ల కాలుష్య సమస్య వస్తోందని గడ్కరీ చెప్పారు. ఈ నేపథ్యంలో దేశీ కంపెనీలు చౌకగా పనిచేసే ఎలక్ట్రిక్‌ కార్లు, బస్సులు, ట్రక్కులు తయారు చేస్తున్నాయని వివరించారు. అయితే, దేశీయంగా ఏటా 1,00,000 మేర ఎలక్ట్రిక్‌ బస్సుల అవసరం ఉంటే తయారీ సామర్థ్యం మాత్రం 50,000–60,000 మాత్రమే ఉందని ఆయన తెలిపారు. ఎగుమతులకు కూడా భారీగా అవకాశాలు ఉన్నందున ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీని మరింతగా పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లిథియం అయాన్‌ బ్యాటరీల ధర కూడా తగ్గుతోందని, కొన్నాళ్లకు ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలు.. పెట్రోల్, డీజిల్‌ వాహనాల రేట్లకు సమానం అవుతాయని మంత్రి చెప్పారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)