2026 నాటికి 4వ అతిపెద్ద ఎకానమీగా భారత్‌

Published on Sat, 01/18/2025 - 05:17

న్యూఢిల్లీ: భారత్‌ 2026 నాటికి ప్రపంచంలో జపాన్‌ను అధిగమించి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని పరిశ్రమల సంఘం– పీహెచ్‌డీసీసీఐ అంచనా వేసింది. మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో భారత్‌ ఎకానమీ 6.8 శాతంగా  నమోదవుతుందని విశ్లేషించింది. ఇది ఆర్‌బీఐ, ప్రభుత్వ అంచనాలకన్నా అధికంగా ఉండడం గమనార్హం.  

ఇక ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే 2025–26 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.7 శాతంగా ఉంటుందని అంచనాకు వచ్చింది.  అమెరికా, చైనా, జర్మనీ, జపాన్‌ల తర్వాత భారత్‌ ప్రస్తుతం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1 వతేదీన లోక్‌సభలో 2025–26 వార్షిక బడ్జెట్‌ను సమ ర్పించనున్న నేపథ్యంలో పీహెచ్‌డీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ అధ్యక్షుడు హేమంత్‌ జైన్‌ చేసిన ఒక ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలు... 

→ ప్రస్తుతం రూ.15 లక్షల పైన ఉన్న ఆదాయానికి 30 శాతం పన్ను రేటు వర్తిస్తోంది. అయితే ఈ స్థాయి పన్ను రేటును  రూ.40 లక్షల పైన ఉన్నవారికి మాత్రమే వర్తింపజేయాలి.  
→ ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి రూ.10 లక్షలకు పెంచాలి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)