Breaking News

రూ.3,076 కోట్ల ప్రాజెక్ట్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

Published on Thu, 05/15/2025 - 12:23

భారతదేశ సెమీకండక్టర్ మిషన్‌కు గణనీయమైన ప్రోత్సాహంగా ఉత్తరప్రదేశ్‌లోని జెవార్‌లో రూ.3,076 కోట్ల సెమీకండక్టర్ తయారీ కేంద్రానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. హెచ్‌సీఎల్‌, ఫాక్స్‌కాన్‌ సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు రూ.76,000 కోట్ల ఇండియా సెమీకండక్టర్ మిషన్లో భాగంగా ఉంది.

సెమీకండక్టర్లు ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలకు కీలకంగా మారాయి. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఆటోమొబైల్స్, పారిశ్రామిక పరికరాలు.. వంటి ప్రతి ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లో వీటి వాడకం అనివార్యం అయింది. తాజాగా ఆమోదం పొందిన ప్రాజెక్ట్‌ సెమీకండక్టర్‌ డిస్‌ప్లే డ్రైవర్ చిప్ తయారీపై దృష్టి పెడుతుంది. ఈ డిస్‌ప్లే డ్రైవర్ చిప్ అనేది స్క్రీన్లపై చిత్రాలు ఎలా కనిపిస్తాయో నియంత్రించే కీలకమైన భాగం.

దేశీయ అవసరాలు తీర్చేలా..

నెలకు 20,000 వేఫర్ల ప్రాసెసింగ్ సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్ నెలకు 36 మిలియన్ చిప్స్ ఉత్పత్తి చేస్తుందని అంచనా వేస్తున్నారు. డిస్‌ప్లే డ్రైవర్ చిప్‌లకు సంబంధించి 40% దేశీయ డిమాండ్‌ను తీర్చగలదని, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని భావిస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా భారత్‌ స్థానాన్ని బలోపేతం చేస్తుందని చెబుతున్నారు.

ఇదీ చదవండి: మర మనిషా..? మైఖేల్‌ జాక్సనా..?

డిజిటల్ భవిష్యత్తు

5జీ, ఏఐ, ఐఓటీ, స్మార్ట్ మొబిలిటీ వంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలకు సెమీకండక్టర్ పరిశ్రమ కీలకం. భారతదేశం గ్లోబల్ సెమీకండక్టర్ పవర్‌హౌజ్‌గా మారేందుకు అడుగులు వేస్తున్న తరుణంగా జెవార్ ప్రాజెక్ట్‌ వంటి కార్యక్రమాలు సాంకేతికత వృద్ధితోపాటు దేశానికి ఆర్థిక వృద్ధికి తోడ్పడుతాయని నిపుణులు అంటున్నారు.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)